గన్ తో సెల్పీ తీసుకోబోయి.. వివాహిత మృతి.. కానీ...

By AN TeluguFirst Published Jul 24, 2021, 9:42 AM IST
Highlights

గురువారం రాత్రి తన మామగారి సింగిల్ బారల్ గన్ తో ఫోజ్ ఇస్తూ సెల్ఫీ దిగాలనుకున్న ఆ యువతి.. అనుకోకుండా ట్రిగర్ మీద వేలు పెట్టి నొక్కింది. ఈ సమయంలో గన్ పూర్తిగా లోడ్ అయి ఉంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఉత్తరప్రదేశ్ : సెల్ఫీ మోజు ఓ మహిళ ప్రాణాలు తీసింది. తుపాకీతో సెల్ఫీకి ఫోజ్ ఇచ్చి ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆమె అక్కడిక్కడే మరణించింది.  ఉత్తరప్రదేశ్ లోని  హర్దోయిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 

గురువారం రాత్రి తన మామగారి సింగిల్ బారల్ గన్ తో ఫోజ్ ఇస్తూ సెల్ఫీ దిగాలనుకున్న ఆ యువతి.. అనుకోకుండా ట్రిగర్ మీద వేలు పెట్టి నొక్కింది. ఈ సమయంలో గన్ పూర్తిగా లోడ్ అయి ఉంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మరణించిన యువతి పేరు రాధిక గుప్తా. బుల్లెట్ ఆమె మెడలోకి చొచ్చుకుపోయింది ఇది గమనించిన వెంటనే ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందిందని డాక్టర్లు దృవీకరించారు. 

2021 మే 21న మృతురాలు రాధిక, తన కొడుకు ఆకాశ్ తో వివాహం అయిందని మృతురాలి మామ రాజేష్ గుప్తా పోలీసులకు తెలిపాడు. అయితే ఈ ఘటన మీద మృతురాలి తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాజేష్ గుప్తా మాట్లాడుతూ.. ‘మాకు నగరంలో నగల వ్యాపారం ఉంది. గురువారం మూడు గంటల సమయంలో నా కొడుకు ఆకాష్ 12 బోర్ సింగిల్ బారెల్ గన్ ఇంటికి తీసుకువచ్చాడు. అది పంచాయతీ ఎన్నికల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో దాన్ని సబ్ మిట్ చేశాం. దాన్ని తీసుకువచ్చి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఓ రూంలో పెట్టాడు. ఆ తరువాత రాధిక దాంతో సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేసింది’ అని చెప్పుకొచ్చారు. 

‘నాలుగు గంటల సమయంలో బుల్లెట్ సౌండ్ వినిపించడంతో వెంటనే పైకి పరిగెత్తాం.. అక్కడ రాధిక బుల్లెట్ గాయాలతో రక్తపుమడుగులో ఉంది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాం. ఫోన్ కెమెరా సెల్ఫీ మోడ్ లో పెట్టి కనిపించింది’ అని పోలీసులకు రాజేష్ తెలిపారు. 

షాహాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివశంకర్ సింగ్ దీనిమీద మాట్లాడుతూ, 12 బ్యారెల్ గన్, మృతురాలి ఫోన్ రెండింటినీ తాము సంఘటనా స్థలంలో సీజ్ చేశామని, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం పంపామని తెలిపారు. 

ఫోన్లో మృతురాలు చనిపోకముందు గన్ తో దిగిన ఓ ఫొటో దొరికిందని తెలిపారు. బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించామన్నారు. మృతురాలి శరీరం మీద బుల్లెట్ గాయం తప్ప.. ఎక్కడా ఎలాంటి గాయాలూ తమకు కనిపించలేదని పోలీసులు తెలిపారు.

రాధిక భర్త ఆకాష్ ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ‘గన్ ను చూడంగానే రాధిక బాగా ఎగ్జైట్ అయ్యింది. ఆమె అప్పటికే చాలా ఫొటోలు గన్ తో తీసుకుంది. అయినా ఇంకా కావాలని సెల్ఫీ తీసుకోబోయింది. దీంతో దారుణం జరిగిపోయింది’ అని చెప్పుకొచ్చాడు. 

అయితే మృతురాలి తండ్రి మాత్రం దీనిమీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. రాకేష్ కావాలనే దీన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడని, వరకట్న మరణంగా దీన్ని నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత.. క్రైమ్ సీన్ రీ క్రియేట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. 

click me!