టెక్ హబ్ గా ఉత్తర ప్రదేశ్ : యోగి సర్కార్ సరికొత్త ప్లాన్

By Arun Kumar PFirst Published Oct 5, 2024, 3:48 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు యోగి ప్రభుత్వం రాష్ట్రాన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) కి సూపర్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తోంది.  

లక్నో : ఉత్తరప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో వుంది యోగి ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) కి సూపర్ హబ్‌గా మార్చేందుకు సిద్దమయ్యింది. ఈ క్రమంలో సీఎం యోగి ఆలోచనకు అనుగుణంగా కొత్త విధానంపై కసరత్తు జరుగుతుంది, దీని ద్వారా రాష్ట్రాన్ని మల్టీ నేషనల్ కంపనీలు, ఏఐ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు సూపర్ హబ్‌గా మార్చడంపై దృష్టి సారిస్తోంది.

గ్లొబల్ కేపబిలిటి సెంటర్లు డిజిటల్ పరివర్తన, సాంకేతిక ఆవిష్కరణలకు కీలకమైన భాగంగా అభివృద్ధి చెందాయని గమనించాలి. అవి ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి,  అధునాతన విశ్లేషణలతో సహా అధిక విలువ కార్యకలాపాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి పరిస్థితిలో సీఎం యోగి మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ అత్యాధునిక సాంకేతిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZలు) సహ పని ప్రదేశాల అభివృద్ధిలో పెట్టుబడులను భారీగా ప్రోత్సహిస్తుంది. ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి త్వరలోనే యూపీ జిసిసి విధానం 2024 అమలులోకి రానుంది.

Latest Videos

ఉత్తరప్రదేశ్ యొక్క వ్యూహాత్మక స్థానం, మెరుగైన కనెక్టివిటీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, యోగి ప్రభుత్వ విధానాలు ఈ చొరవను గేమ్ఛేం జర్‌గా మార్చగలవు... దీని వలన రాష్ట్రం ఈ రంగంలో దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా అవతరించగలదని భావిస్తున్నారు. 

GCC రంగంలో ప్రపంచ నాయకుడిగా భారత్ 

గ్లొబల్ కేపబిలిటి సెంటర్లు రంగంలో భారతదేశం తనను తాను ప్రపంచ నాయకుడిగా దృఢంగా నిలబెట్టుకుంది. 2030 నాటికి దేశీయ మార్కెట్‌లో దాదాపు 110 బిలియన్ డాలర్ల వాటా సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ఆధారంగా జిసిసి రంగం నుండి వస్తుందని అంచనా. 2024 నాటికి దేశం యొక్క జిసిసి పరిశ్రమ 1.9 మిలియన్లకు పైగా నిపుణులకు ఉపాధి కల్పించింది... ఆర్థిక వ్యవస్థకు 64.6 బిలియన్ డాలర్లను అందించింది, ఇది భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో 1% కంటే ఎక్కువ.

భారతదేశంలోని జిసిసిల సంఖ్య 2030 నాటికి 1,700 నుండి 2,400 కి పెరుగుతుందని భావిస్తున్నారు, సంభావ్య విస్తరణ 2,550 కేంద్రాలకు చేరుకుంటుంది, దీని వలన 2.5 మిలియన్లకు పైగా ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త జిసిసిల వార్షిక స్థాపన 70 నుండి 115 కి పెరిగే అవకాశం ఉంది, ఇది ప్రపంచ సాంకేతిక, సేవా కేంద్రంగా భారతదేశం యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. వీటినే లక్ష్యంగా చేసుకుని యూపీ జిసిసి విధానం 2024 ముసాయిదాను ప్రవేశపెట్టింది. యూపీతో పాటు కర్ణాటక కూడా ఈ విధానాన్ని త్వరలో అమలు చేయబోతోంది... దాని ముసాయిదాను కూడా సిద్ధం చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిసిసిలకు అతిపెద్ద కేంద్రం

జిసిసిల అభివృద్ధి దేశం, రాష్ట్రంలో ప్రభావవంతంగా ఉంది, ఇది సాధారణ వ్యాపార ప్రక్రియ అవుట్‌సోర్సింగ్ (BPO) కేంద్రాల నుండి నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (KPO),  బహుళ క్రియాత్మక కేంద్రాలుగా రూపాంతరం చెందింది. ఉత్తరప్రదేశ్ దాని వ్యూహాత్మక స్థానం, యువ కార్మిక శక్తి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలతో ఈ వృద్ధిని సద్వినియోగం చేసుకోవడానికి అనుకూలమైన స్థితిలో ఉంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రతిభా వృద్ధి,ఆర్థిక ప్రోత్సాహకాలపై దృష్టి సారించడం ద్వారా రాష్ట్రం జిసిసి పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్, సాంకేతిక రంగాలకు ఒక పెద్ద జసిసి కేంద్రంగా ఉంది.

అప్‌స్ట్రీమ్,  డౌన్‌స్ట్రీమ్ విభాగాలుగా విభజించబడిన జిసిసి రంగం

జిసిసి రంగాలను ప్రధానంగా అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ విభాగాలుగా వర్గీకరించారు. అప్‌స్ట్రీమ్ రంగాలు అత్యంత ప్రత్యేకమైనవి... కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్, డీప్-టెక్, రోబోటిక్స్ వంటివి దీని కిందకు వస్తాయి. మరోవైపు డౌన్‌స్ట్రీమ్ రంగాల్లో బిఎఫ్ఎస్ఐ,  సాఫ్ట్‌వేర్, సాంకేతికత, ఇంధనం, యుటిలిటీలు వంటివి ఉన్నాయి. ప్రస్తుతం అప్‌స్ట్రీమ్ రంగాలు భారతదేశంలోని అన్ని జిసిసిలలో దాదాపు 25% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, అయితే డౌన్‌స్ట్రీమ్ రంగాలు మొత్తం జిసిసి వాటాలో దాదాపు 75% వాటాను కలిగి ఉన్నాయి.

 ESDM (ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీ), ఐటీ లేదా ఐటీఈఎస్ రంగాలలో యూపీ బలంగా వుంది.  ఈ రంగాల ఎగుమతులలో అత్యధిక వాటాను కలిగి ఉండటం, 3,50,000 కంటే ఎక్కువ మంది నిపుణులకు ఉపాధి కల్పించడం జరుగుతోంది. ఇలా డౌన్‌స్ట్రీమ్ జిసిసి లను ఆకర్షించడానికి అనుకూలమైన స్థితిలో ఉంది. అందువల్ల ఉత్తరప్రదేశ్ సాఫ్ట్‌వేర్, సాంకేతికత, బిఎఫ్ఎస్ఐ, సెమీకండక్టర్, హెల్త్‌కేర్, వైద్య పరికరాలతో సహా డౌన్‌స్ట్రీమ్ జిసిసి రంగాలకు ఒక హాట్‌స్పాట్‌గా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఏఐ, డేటా అనలిటిక్స్, డిజిటల్ ఇంజనీరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలోకి ప్రవేశించడానికి కూడా రాష్ట్రానికి ప్రత్యేక అవకాశం ఉంది. ముసాయిదా ప్రకారం ఈ విధానాన్ని 5 సంవత్సరాల కాలానికి ప్రతిపాదించారు. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ యూపీ ద్వారా విధాన అమలు యూనిట్ (PIU) ను ఏర్పాటు చేయనున్నారు.. 

యూపీలో40 ఐటీ పార్కులు, సెజ్ ల ఏర్పాటు : 

  • 40 ఐటీ పార్కులు, 25 ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZలు) కోసం ఆధునిక, ఉపయోగానికి సిద్ధంగా ఉన్న కార్యాలయ స్థలాన్ని అందిస్తారు. అటువంటి పరిస్థితిలో జిసిసి విధానం ద్వారా ఇక్కడ కూడా పెట్టుబడి , సంస్థల స్థాపనను ప్రోత్సహిస్తారు.
  • నోయిడా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) కి ప్రముఖ గమ్యస్థానంగా మారింది, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో ప్రపంచ సాంకేతిక తయారీ దిగ్గజాల నుండి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
  • ఉత్తర భారతదేశంలో డేటా సెంటర్, సెమీకండక్టర్ హబ్‌గా రాష్ట్రం తనను తాను స్థాపించుకుంది. యోటా,  ఎస్టిటి గ్లోబల్, వెబ్ వర్క్స్ వంటి ప్రముఖ సంస్థలు యూపీలో పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జెవర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 1,000 ఎకరాలలో ఒక సెమీ కండక్టర్ పార్కును ప్రకటించింది, ఇది యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA)లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్, రాపిడ్ రైలు రవాణా వ్యవస్థ (RRTS) కు అనుసంధానించబడి ఉంది.
  • అదనంగా రాష్ట్రం YEIDA ప్రాంతంలో ఒక ఎలక్ట్రానిక్ పార్క్ (250 ఎకరాలు), ఒక డేటా సెంటర్ పార్క్, ఇతర ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ (EMC) లను ఏర్పాటు చేస్తోంది.
  • లక్నోలో ఏఐ సిటీ (40 ఎకరాలు) ప్రణాళిక యూపీ యొక్క మౌలిక సదుపాయాలను మరింత పెంచుతుంది. రాష్ట్రం సమీకృత పారిశ్రామిక పట్టణాలు (750 ఎకరాలు), వైద్య పరికరాల పార్క్ (350 ఎకరాలు) మరియు YEIDA ప్రాంతంలో ఫిన్‌టెక్ పార్క్ వంటి సౌకర్యాలతో జిసిసి అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.
  • ప్రస్తుతం కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, నోయిడా, మీరట్‌లలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI)లు పనిచేస్తున్నాయి, ఇవి దాదాపు 300 రిజిస్టర్డ్ IT యూనిట్లకు సేవలను అందిస్తున్నాయి. ఆగ్రా, బరేలీ, గోరఖ్‌పూర్, వారణాసిలలో కొత్త ఎస్టిపిఐ లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది.
click me!