అర్థరాత్రి 25వ అంతస్తునుంచి పడి.. కవల సోదరులు మృతి.. !

By AN TeluguFirst Published Oct 18, 2021, 9:22 AM IST
Highlights

పిల్లలు 25 వ అంతస్తు నుండి.. అంత రాత్రిపూట ఎలా కింద పడ్డారో స్పష్టంగా తెలియడం లేదు. ఆ రాత్రి వారు బాల్కనీలో ఏం చేస్తున్నారు. ఎలా కింద పడ్డారన్న దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఘజియాబాద్ : ఘజియాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ భవనం 25 వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి శనివారం రాత్రి పద్నాలుగేళ్ల కవల సోదరులు died. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు.

అయితే, పిల్లలు 25 వ అంతస్తు నుండి.. అంత రాత్రిపూట ఎలా కింద పడ్డారో స్పష్టంగా తెలియడం లేదు. ఆ రాత్రి వారు బాల్కనీలో ఏం చేస్తున్నారు. ఎలా కింద పడ్డారన్న దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటన జరిగిన సమయంలో పిల్లల తండ్రి అఫీషియల్ టూర్ మీద ముంబై నుంచి దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో  twin brothers తల్లి, సోదరి మాత్రమే ఇంట్లో ఉన్నారని పోలీసులు తెలిపారు.

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సిద్ధార్థ్ విహార్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుండి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు వచ్చింది. వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

ఎయిమ్స్ మహిళా వైద్యురాలిపై సహోద్యోగి అత్యాచారం.. కేసు నమోదు..!

"గత రాత్రి 1 గంటకు సత్యనారాయణ, సూర్యనారాయణ అనే ఇద్దరు కవల పిల్లలు వారి అపార్ట్‌మెంట్ భవనం25 వ అంతస్తు నుండి కిందపడ్డారు. పడడం పడడమే.. మృత్యు ఒడికి చేరుకున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటన ప్రమాదంగా కనిపిస్తుంది. కానీ, వాస్తవాలు వెలికి రావాలంటే పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. ఈ కవలలు  9 వ తరగతి విద్యార్థులు" అని మహిపాల్ సింగ్, విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ అధికారి చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం.. 
కాగా, ఉత్తరప్రదేశ్ లో 17ఏళ్ల మైనర్ బాలికపై ఆమె తండ్రి సహకారంతో అత్యాచారానికి పాల్పడిన సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ నేతలు అరెస్టయ్యారు. తనపై కన్నతండ్రితో సహా మరో 28 మంది అత్యాచారానికి పాల్పడినట్లు... వారిలో BSP, SP ల జిల్లా అధ్యక్షులు కూడా వున్నట్లు యుదతి బయటపెట్టింది. ఆమె ఫిర్యాదుమేరకు uttar pradesh లలిత్ పూర్ జిల్లా సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు  తిలక్‌ యాదవ్‌, బిఎస్పీ అధ్యక్షులు దీపక్‌ అహిర్‌వర్‌ లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నిఖిల్‌ పాఠక్‌ వెల్లడించారు.  

మొదట తన తండ్రి, ఆ తర్వాత అతడి సాయంతో మరికొందరు తనపై గత ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధిత యువతి బయటపెట్టింది. lalitpur జిల్లాలోని పల ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మీర్జాపూర్ జిల్లాలోని ఓ హోటల్ లో దాక్కున్న తిలక్‌ యాదవ్‌, దీపక్‌ అహిర్‌వర్‌ తో పాటు ఒక ఇంజనీరును అరెస్టు చేసారు.   

లలిత్ పూర్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు తిలక్ యాదవ్ పై అత్యాచార ఆరోపణలు, అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ అదిష్టానం సీరియస్ అయ్యింది. మొత్తం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు సమాజ్ వాది ప్రకటించింది.  
కొన్నేళ్లుగా తనపై జరిగిన అత్యాచారం గురించి బాధిత బాలిక తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ట్రక్ డ్రైవర్ గా పనిచేసే తండ్రి ఆరో తరగతిలో వుండగానే బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. తల్లి ఇంట్లోలేని సమయంలో కొత్తబట్టలు కొనిపెడతానని ఒంటరిగా బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అప్పటినుండి పలుమార్లు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసేవాడని... ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించేవాడని బాలిక తెలిపింది. 

click me!