
పాట్నా: సొంత మనమడే నాన్నమ్మపై లారీ ఎక్కించి అతి దారుణంగా హతమార్చిన దారుణం బిహార్ లో జరిగింది. నిన్న(ఆదివారం) తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గువేస్తున్న నాన్నమ్మపైకి లారీ ఎక్కించాడు కసాయి మనవడు. దీంతో వృద్దురాలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే... Bihar రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లోని రాక్సా గ్రామానికి చెందిన దిలీప్ లారీ డ్రైవర్. నిత్యం లారీపై ఎక్కడెక్కడికో వెళుతుండే అతడు దసరా పండగను కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఇంటికి వచ్చాడు. అయితే పండగ సమయంలోనూ కుంటుంబసభ్యులు ప్రశాతంగా వుండకుండా గొడవలు పడటం అతడిని తీవ్రంగా కలచివేసింది. అయితే ఈ గొడవలన్నింటికి ఇంట్లో పెద్దమనిషి నాన్నమ్మే కారణమని భావించి ఆమెతో దిలీప్ గొడవపడ్డాడు.
అయితే తన తల్లితో గొడవపడుతున్నకొడుకును మందలించి ఇంట్లోంచి బయటకు పంపాడు రాజేశ్వర్ రాయ్. కానీ ఇంట్లో అశాంతికి కారణమవుతుందని భావించిన నాన్నమ్మపై దిలీప్ కోపం మాత్రం తగ్గలేదు. దీంతో ఈ కోపంలోనే దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
READ MORE అర్థరాత్రి 25వ అంతస్తునుంచి పడి.. కవల సోదరులు మృతి.. !
నాన్నమ్మ చనిపోతేనే ఇళ్ళు ప్రశాంతంగా వుంటుందని భావించిన అతడు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున ఇంటిబయట ముగ్గు వేస్తున్న నాన్నమ్మపైకి లారీ ఎక్కించి అతి కిరాతకంగా హతమార్చాడు.
కుటుంబసభ్యులు ఇంటిబయటకు వచ్చి చూడగా లారీ చక్రాల కింద నలిగి వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో తన తల్లిని కిరాతకంగా చంపిన కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు రాజేశ్వర్ రాయ్. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వృద్దురాలి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.