కదులుతున్న కారులో విద్యార్ధినిపై నలుగురు గ్యాంగ్‌రేప్: కారుకు పోలీస్ లోగో

By sivanagaprasad KodatiFirst Published Dec 5, 2019, 4:05 PM IST
Highlights

హైదరాబాద్ దిశ ఘటన మరచిపోకముందే దేశవ్యాప్తంగా ఏదో మూల మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలికపై నలుగురు యువకులు కదులుతున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. 

హైదరాబాద్ దిశ ఘటన మరచిపోకముందే దేశవ్యాప్తంగా ఏదో మూల మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలికపై నలుగురు యువకులు కదులుతున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ పోలీసు అధికారి బ్రిజ్‌లాల్ మౌర్య కుమారుడు జయప్రకాశ్ మౌర్య తన సోదరిని చూసేందుకు తరచూ హాలియా ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో బాధితురాలితో పరిచయం ఏర్పడింది.

Also Read:Disha case: దిశ సెల్‌ఫోన్ పాతిపెట్టిన నిందితులు, స్వాధీనం

సోమవారం తన సోదరిని చూసేందుకు ఆ గ్రామానికి వెళ్లిన జయప్రకాశ్.. సదరు విద్యార్ధినిని గ్రామ శివారులో కలవాల్సిందిగా కోరాడు. అప్పటికే తన ముగ్గురు స్నేహితులతో అక్కడ వేచివున్న జయప్రకాశ్... అక్కడికి చేరుకున్న బాధితురాలిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు.

అనంతరం కదులుతున్న కారులోనే ఆమెపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కారుకు పోలీస్ అనే లోగో ఉండటం గమనార్హం. అయితే వీరు ప్రయాణిస్తున్న కారును విధులు నిర్వహిస్తున్న పోలీసులు చూడటంతో పాటు అందులోంచి యువతి అరుపులు వినిపించడంతో వారు కారును ఆపి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read:హైద్రాబాద్‌లో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేసిన భార్య

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలితో పాటు నలుగురు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను జయప్రకాశ్ మౌర్య, లవకుమార్ పాల్, గణేశ్ ప్రసాద్, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మహేంద్ర కుమార్ యాదవ్‌లుగా తెలిపారు. 

click me!