గొంతు కోసి.. చేతి వేళ్లు నరికేసి.. రక్తపు మడుగులో డెడ్‌బాడీ

Published : Jun 24, 2022, 06:05 PM IST
గొంతు కోసి.. చేతి వేళ్లు నరికేసి.. రక్తపు మడుగులో డెడ్‌బాడీ

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి, చేతి వేళ్లు, కాలి వేళ్లు నరికేస ఆ డెడ్ బాడీని ఓ రోడ్డుపై పడేసి వెళ్లారు. మృతుడికి దగ్గరి వారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని ఎస్పీ తెలిపారు.  

పాట్నా: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ టీనేజీ అబ్బాయి మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. పదునైన మెత్తని ఆయుధంతో గొంతు కోసినట్టుగా ఉన్నది. చేతి వేళ్లు నరికేశారు. డియోరియా నగరంలో ఈ స్థితిలో 17 ఏళ్ల బాలుడి డెడ్ బాడీ కనిపించింది. ప్రాథమికంగా ఇది హత్యేనని తెలుస్తున్నది.

మృతుడిని రెహ్మాన్‌గా గుర్తించారు. లార్ టౌన్న‌లో నివాసిగా కనుగొన్నారు. రెహ్మాన్ తండ్రి నడుపుతున్న గ్రాసరీ షాప్‌లో పని సహాయం చేస్తుండేవాడని తెలిసింది. నిన్న రాత్రి రెహ్మాన్ ఇల్లు వదిలి టూ వీలర్ పై బయటకు వచ్చాడు. అంతే.. ఇక మళ్లీ తిరిగి వెళ్లలేదు. సుతావర్ నుంచి చౌముఖాను కలిపే రోడ్డు పై ఈ డెడ్ బాడీ కనిపించింది.

రెహ్మాన్ డెడ్ బాడీని ఆ రోడ్డు పొడవునా ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో దుండగులు పడేసి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రెహ్మాన్ డెడ్ బాడీ చేతి వేళ్లు, కాలి వేళ్లు నరికేసి ఉన్నాయి. పదునైన ఆయుధంతో రెహ్మాన్‌ను దారుణంగా హతమార్చినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ సంకల్ప్ శర్మ వెల్లడించారు. అయితే, రెహ్మాన్‌ను గుర్తెరిగిన వారే.. అంటే దగ్గరి వారే హత్య చేసి ఉండొచ్చని ఆయన అనుమానించారు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu