నా కొడుకుతో ఎందుకు సమస్య: ఏక్‌నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాక్రే

By narsimha lodeFirst Published Jun 24, 2022, 4:28 PM IST
Highlights

శివసేన జిల్లా అధ్యక్షులతో శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్దవ్ ఠాక్రే., పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ముంబై:Shiv Sena, ఠాక్రే పేర్లను ఉపయోగించకుండా మీరు ఎంత దూరం వెళ్లగరని మహారాష్ట్ర సీఎం Uddhav Thackeray తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.శుక్రవారం నాడు శివసేన జిల్లా శాఖల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఠాక్రే మాట్లాడారు. పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన Rebel ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తనను విడిచిపెట్టిన వారిని తాను ఎందుకు పట్టించుకోవాలని ఆయన ప్రశ్నించారు.

శివసేనను విడిచిపెట్టడం కంటే ముందే చనిపోతామని ప్రకటించిన వారు ఇవాళ పారిపోయారన్నారు. ఉద్ధవ్ ఠాక్రే అతని తనయుడు Aditya Thackeray కు వ్యతిరేకంగా Eknath Shinde  40 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టారు. ఈ సమయంలో శివసేన జిల్లా శాఖల అధ్యక్షులతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యారు. ఏక్ నాథ్ షిండే తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో గౌహాతిలోని ఓ హోటల్ లో బస చేస్తున్నారు. ఆదిత్య ఠాక్రే ఇతర మంత్రుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా ఆరోపణలున్నాయి.

ఏక్‌నాథ్ షిండే తన స్వంత కొడుకును MP గా చేసుకొన్నాడు. నా కొడుకుతో ఎందుకు సమస్య అని ఠాక్రే ప్రశ్నించారని సమాచారం. నా శరీరం, నా తల, మెడ నుండి పాదాల వరకు నొప్పిగా ఉందన్నారు. తాను కోలుకోలేనని అనుకున్నారు.   కానీ అవేవీ తాను పట్టించుకోలేదన్నారు. 

తనకు అధికారంపై అత్యాశ లేదన్నారు. వర్షంలోనే సీఎం నివాసం నుండి మాతోశ్రీకి బయలుదేరానని ఆయన చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అత్యాశతో పక్కకు లాక్కున్నారని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. 


మహారాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనకు  40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే శుక్రవారం నాడు ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా మాతో చేరారని వారి అఫిడవిట్‌లు మా వద్ద ఉన్నాయన్నారు.. మెజారిటీ సభ్యులు  మా వద్ద ఉన్నారన్నారు.. 40 మందికి పైగా సేన ఎమ్మెల్యేలు మరియు 12 మంది స్వతంత్రులు మరియు ఇతరులు త‌మ‌తో ఉన్నారని ఏక్‌నాథ్‌ షిండే నొక్కిచెప్పారు.

ఈ క్రమంలోనే తాము పార్టీ మారబోమని, కొత్త పార్టీ పెట్టబోమని శివ‌సేన రెబల్ నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే స్ప‌ష్టం చేశారు. తామే బాలాసాహెబ్ ఠాక్రే అస‌లైన శివ సైనికుల‌మ‌ని అన్నారు.  ప్ర‌భుత్వ ఏర్పాటుపై త‌మ‌తో క‌లిసి వున్న‌వారిపై త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. మూడు కూటమి భాగస్వాములు చివరి వరకు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నందున 30 నెలల మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)ని పడగొట్టడానికి బీజేపీ తిరుగుబాటును ప్రేరేపించిందని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ ఆరోపించాయి.

also read:16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు శివసేన పిటిషన్.. వాట్ నెక్స్ట్?

రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి డాక్టర్.నితిన్ రౌత్ శుక్రవారం నాడు శివ‌సేన శ్రేణులలో తిరుగుబాటును ఇంజినీరింగ్ చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది అని ఆరోపించారు.మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌పై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ త‌న పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. సంకీర్ణ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగిన సొంత వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

click me!