ఛలో ఖతమ్ చేసేద్దాం.. యూట్యూబ్ షేర్ చేసిన ఫన్నీ రిజైన్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్

By Mahesh KFirst Published Jun 24, 2022, 5:21 PM IST
Highlights

సోషల్ మీడియాలో ఈ మధ్య చిత్ర విచిత్రమైన లెటర్స్ పోస్టులు వస్తున్నాయి. అవి తెగ వైరల్ అవుతున్నాయి. నిజాయితీతో కూడుకుని షార్ట్‌గా పాయింట్‌ను విశదపరుస్తున్న ఈ లేఖలపై నెటిజన్లు కూడా అదే రేంజ్‌లో స్పందిస్తుంటారు. తాజాగా యూట్యూబ్ ఇండియా ఇలాంటి ఓ రాజీనామా లేఖను షేర్ చేసింది.
 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పన్నీ లీవ్ లెటర్లు, రాజీనామా లేఖలు వైరల్ అవుతున్నాయి. షార్ట్‌గా ఉంటూ.. నవ్వు తెప్పించేవిగా ఆ లేఖలు ఉంటున్నాయి. సాంప్రదాయ విధానాలకు.. అంటే రిజైన్ లెటర్ అంటే ఇలాగే ఉండాలనే విధానాలను పక్కన పెట్టి రాస్తున్న ఈ లెటర్‌లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటాయి. ఆ లెటర్‌లలో చాలా వరకు నిజాయితీగా రాసినవి ఉండటం మరో అంశం. అందుకే నెటిజన్లు ఆ లేఖలను చూసి తెగ మురిసిపోతుంటారు. ఫన్నీ కామెంట్లతో పోటెత్తుతుంటారు. తాజాాగా, యూట్యూబ్ ఇండియా షేర్ చేసిన రాజీనామా లేఖ వైరల్ అవుతున్నది.

సంబంధిత అధికారికి అని పేర్కొంటూ.. ఛలియే ఖతమ్ ఖర్తే హై అని హింగ్లీష్‌లో ఆ రిజిగ్నేషన్ లెటర్ ఉన్నది. అంటే.. ఛలో ఇక ఖతమ్ చేసేద్దాం అని అర్థం. అంటే.. ఉద్యోగానికి ఇక రాం.. రాం.. చెప్పేద్దామనే అర్థంలో ఆ రాజీనామా లెటర్ ఉన్నది. ఆ రాజీనామా లేఖను యూట్యూబ్ ఇండియా హ్యాండిల్‌లో ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 

nice resignation letter pic.twitter.com/qhYo3quPA7

— YouTube India (@YouTubeIndia)

Tata Good bye. https://t.co/6bm72Fcb48

— ItsRakesh (@Rakesh141Behera)

ఈ షార్ట్ అండ్ స్వీట్ లెటర్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఒకరైతే వ్యంగ్యంగా.. మీరు రాజీనామా చేయకండి అంటూ యూట్యూబ్ ఇండియా హ్యాండిల్‌కు కామెంట్ చేశారు. అందుకు.. చేసేదే లేదు అనే అర్థంలో యూట్యూబ్ ఇండియా సమాధానం ఇచ్చింది. మరొకరు.. ఛలో ఇంక పడుకుందాం అని కామెంట్ చేశారు. ఇంకొకరు ఈ లెటర్‌ను తాను తన భవిష్యత్ అవసరాలకు దాచుకుంటానని పేర్కొన్నారు. మరొకరు చిలిపిగా ఈ లెటర్‌ను తన ఎక్స్‌కు అంకితం చేస్తానని.. ఛలో ఇక ఖతమ్ చేసేద్దాం మన రిలేషన్‌షిప్ అనే రేంజ్‌లో కామెంట్ చేశారు.

Bas yahi kehna chahengey pic.twitter.com/5O4lFrgvie

— Bajaj Capital (@mybajajcapital)

కాగా, బజాజ్ క్యాపిటల్ కూడా ఇలాంటి ఓ రాజీనామా లేఖనే ట్వీట్ చేసింది. డియర్ సార్ అని వినమ్రంగా మొదలు పెట్టిన ఆ లేఖలో నా నిద్ర.. నా మనశ్శాంతి నాకు తిరిగి ఇచ్చేయండి.. లేదంటే.. నాతోని కాదు అన్నట్టుగా ఓ వ్యక్తి రాజీనామా లేఖ రాశారు. ఈ లేఖనే బజాజ్ క్యాపిటల్ షేర్ చేసింది.

click me!