దారుణం:మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు ముందే భార్యను చంపాడు

By narsimha lode  |  First Published May 5, 2020, 6:05 PM IST

మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంగా గర్భంతో ఉన్న భార్యను కొడుకు ముందే కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్  రాష్ట్రంలో చోటు చేసుకొంది.


న్యూఢిల్లీ: మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంగా గర్భంతో ఉన్న భార్యను కొడుకు ముందే కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్  రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సర్పాథన్ ఏరియాలో గల భాటోలి గ్రామానికి చెందిన దీపక్ సింగ్ తన కుటుంబంతో ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. దీపక్ సింగ్ కు భార్య నేహా, నాలుగేళ్ల కొడుకుతో డిల్లీలో ఉంటున్నాడు. 

Latest Videos

undefined

దీపక్ భార్య నేహాకు 25 ఏళ్లు. ఆమె ప్రస్తుతం గర్భవతి.  కుటుంబంతో కలిసి దీపక్ సింగ్ భార్య, కొడుకుతో కలిసి ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు. అదే సమయంలో లాక్‌డౌన్ రావడంతో ఆయన కుటుంబంతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాడు.

also read:ఇండియాను వణికిస్తున్న కరోనా: 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు,మరణాలు

40 రోజుల తర్వాత మద్యం దుకాణాలను ఓపెన్ చేశారు. లాక్ డౌన్ తర్వాత  లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు. దీంతో మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని ఆయన భార్యను కోరాడు. ఆమె ఇందుకు నిరాకరించింది. ఇంట్లో సరుకులు కొనుగోలు చేసేందుకే డబ్బులు లేవని చెప్పింది. అసలే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మద్యం కోసం లిక్కర్ షాపుకు వెళ్లకూడదని భార్య కోరింది.

ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో దీపక్ భార్యపై కోపం ఆపుకోలేకపోయాడు. ఇంట్లో ఉన్న తుపాకీని తీసుకొని భార్యను కాల్చి చంపాడు. ఆ సమయంలో నాలుగేళ్ల కొడుకు కూడ అక్కడే ఉన్నాడు. తుపాకీతో కాల్చడంతో ఆ చిన్నారి భయంతో ఇంటి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కొన్నాడు.

తుపాకీ శబ్దం విన్న ఇరుగు పొరుగు నేహాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్గం కోసం తరలించారు.


 

click me!