Hathras Case : హథ్రాస్ లో బాలికపై హత్యాచారం కేసులో.. నిందితుడికి మరణశిక్ష..

By AN TeluguFirst Published Sep 24, 2021, 12:00 PM IST
Highlights

35 యేళ్ల వయసున్న దోషి మోను ఠాకూర్.. మైనర్ బాలికమీద అత్యాచారం చేసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాధిత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

నోయిడా : హథ్రాస్ కేసు(Hathras Case)లో పోక్సో కోర్టు (POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ జిల్లాలో 14 యేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి, చంపిన కేసులో దోషి అయిన మోను ఠాకూర్ కు స్థానిక పోక్సో కోర్టు మరణ శిక్ష (Death Sentence)  విధించినట్లు పోలీసులు తెలిపారు. 

35 యేళ్ల వయసున్న దోషి మోను ఠాకూర్.. మైనర్ బాలికమీద అత్యాచారం చేసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాధిత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఠాకూర్ మీద సెక్షన్ 354, 326, 452, 302, 376, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. 

పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసులో 42 రోజుల్లో ఛార్జ్ షీట్ సమర్పించారు. ఎస్పీ వినీత్ జైస్వాల్ సత్వర విచారణ జరిపి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. హత్యాచారం కేసులో దోషి అయిన మోను ఠాకూర్ కు పోక్సో కోర్టు న్యాయమూర్తి ప్రతిభా సక్సేనా మరణశిక్ష విధించారు. దీంతోపాటు దోషికి రూ. 1.68 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌ కేసు దర్యాప్తు పలు మలుపులు తిరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం మొదట సీబీఐకి అప్పగించగా, తాజాగా ఈ కేసు కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తును అలహాబాద్‌ కోర్టు పర్యవేక్షించనున్నట్లు సుప్రీం తెలుపుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ, దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.

బాధితురాలి దహన సంస్కారాలు పోలీసులు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదనే అనుమానం వ్యక్తం చేశారు..ఈమెకు మద్ధతుగా పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదంటూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. 

హత్రాస్ కేసు: దర్యాప్తు అధికారి భార్య ఆత్మహత్య, యూపీలో సంచలనం

ఈ క్రమంలో అక్టోబర్‌ 15న వెల్లడించాల్సిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు.

ఇప్పటికే హత్రాస్‌ కేసును సీబీఐకి బదిలీ చేసి, సుప్రీంకోర్టు పర్యవేక్షణకు సమ్మతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి రక్షణపై, బాధితుడి కుటుంబం న్యాయవాదిని ఎన్నుకున్నదా అనే దాని గురించి ఉన్నత న్యాయస్థానం వివరాలు సమర్పించింది. బాధితురాలి కుటుంబం న్యాయవాదిని నియమించుకున్నప్పటికి.. ప్రభుత్వం నియమించిన న్యాయవాదిని తమ తరఫున కేసును వాదించాలని కోరారు

19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్‌ 14న హథ్రాస్‌లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 15 రోజులు పాటు మృత్యువుతో పోరాటిన అనంతరం బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 29న కన్నుమూసింది. 

click me!