తన ఫోన్ ఎత్తడం లేదని.. నడిరోడ్డుపై యువతిమీద కత్తితో దాడి..హత్య... ఆపై...

By AN TeluguFirst Published Sep 24, 2021, 10:45 AM IST
Highlights

స్నేహితురాలితో మాట్లాడుతున్నానని శ్వేత చెబుతూ ఉండగానే రామచంద్రన్ దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ…  చొక్కాల్లో దాచుకున్న కత్తిని బయటకు తీసి ఆమె గొంతులో పొడిచాడు. ఆ తర్వాత గొంతుకోశాడు. 

తమిళనాడు : చెంగల్పట్టు జిల్లా తాంబరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టపగలు ఓ యువకుడు విద్యార్థినిపై కత్తితో దాడి (Stabbed to Death)చేసి హత్యకు పాల్పడ్డాడు ఆ తర్వాత అదే కత్తితో ఆత్మహత్య(Suicide)కు ప్రయత్నించాడు.

గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…  స్థానిక క్రోమ్ పేట కు చెందిన ఎంటీసీ బస్ డ్రైవర్ కుమార్తె శ్వేత తాంబరంలోని ఎంసీసీ కళాశాల లో డిగ్రీ చదువుతోంది. గురువారం తరగతులు ముగించుకుని స్నేహితురాలితో బయటకు వచ్చిన శ్వేతను ఆమె స్నేహితుడు  రామచంద్రన్, నేను ఫోన్ చేస్తే తీయకుండా ఎవరితో గంటలకొద్దీ మాట్లాడుతున్నావ్ అంటూ నిలదీశాడు.

స్నేహితురాలితో మాట్లాడుతున్నానని శ్వేత చెబుతూ ఉండగానే రామచంద్రన్ దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ…  చొక్కాల్లో దాచుకున్న కత్తిని బయటకు తీసి ఆమె గొంతులో పొడిచాడు. ఆ తర్వాత గొంతుకోశాడు. వారి పక్కనే ఉన్న శ్వేత స్నేహితురాలు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా రామచంద్రన్ అదే కత్తితో గొంతుపై గాయం చేసుకుని పడిపోయాడు.

సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన  శ్వేతను, సృహ తప్పినట్లుగా పడి ఉన్న రామచంద్రన్ ను క్రోమ్ పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  అయితే ఆసుపత్రిలో చికిత్స ఫలించక శ్వేత మృతి చెందింది.

2019 వేసవి సెలవుల్లో నాగపట్టణం జిల్లా  తిరుక్కువల్ లోని తమ బామ్మ ఇంటికి రైలులో వెళ్తున్న సమయంలో నేతకు రామచంద్రం తో పరిచయం ఏర్పడింది.  తాను  ఫోర్డ్ సంస్థలో పని చేస్తున్నానని చెప్పిన రామచంద్రన్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కరోనా కారణంగా ఊరికి వెళ్లలేని పరిస్థితుల్లో  ఇద్దరు ఫోన్ ద్వారానే మాట్లాడుకునేవారు.

‘చీర కట్టుకుని వస్తే నో ఎంట్రీ’ వార్త నిజమేనా? రెస్టారెంట్ సిబ్బంది ఏం చెబుతున్నారంటే..

రాత్రి వేళల్లో లాప్టాప్ లో రామచంద్రన్ తో మాట్లాడే శ్వేత కొంతకాలంగా మాట్లాడడం తగ్గించినట్లు సమాచారం.  కొంతకాలంగా అతని వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో శ్వేత అతనికి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.  అయితే శ్వేత మరొకరితో సన్నిహితంగా ఉండటం వల్లనే  తనను దూరం పెడుతుందని అనుమానించిన రామచంద్రన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై తాంబరం పోలీసులు కేసు నమోదు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా 2016 జూన్ 24వ తేదీన స్థానిక నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో  ఇదే తరహాలో ఓ యువకుడు  తను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.

click me!