యూకే ప్రయాణం దాచి, పార్టీలో కేరింతలు: కనికాపై యూపీ సర్కార్ సీరియస్

By Siva KodatiFirst Published Mar 20, 2020, 9:30 PM IST
Highlights

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో లక్నలో ఆమె పాల్గొన్న పార్టీకి హాజరైన వారిలో ఆందోళన నెలకొంది. కనికాను కలిసిన తర్వాత బీజేపీ దుష్యంత్.. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలిశారు

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో లక్నలో ఆమె పాల్గొన్న పార్టీకి హాజరైన వారిలో ఆందోళన నెలకొంది. కనికాను కలిసిన తర్వాత బీజేపీ దుష్యంత్.. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలిశారు.

ఇప్పటికే తల్లి వసుంధరా రాజేతో కలిసి దుష్యంత్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో కనికా కపూర్‌ విదేశీ ప్రయాణాన్ని దాచిపెట్టడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

Also Read:కరోనా పాజిటివ్ సింగ‌ర్‌పై దర్శకుడు ఫైర్.. 400 మందితో పార్టీ, విచ్చలవిడిగా తిరిగింది

ఈ నెల 15న యూకే నుంచి భారత్‌కు వచ్చిన కనికా కపూర్ తన ప్రయాణ వివరాలను ప్రభుత్వానికి అందించలేదు. ఆ తర్వాత లక్నోలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్రముఖులకు ఆమె పార్టీ ఇచ్చింది. యూకే నుంచి వచ్చిన తర్వాత సెల్ఫ్ క్వారంటైన్ కాకపోవడంపై యూపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Aslo Read:కనికా కపూర్‌కు కరోనా : ఆ ప్రముఖులకు వెన్నులో వణుకు.. హోమ్ క్వారంటైన్‌లో వసుంధర రాజే

మరోవైపు కనికా కపూర్‌ను కలిసిన వారి జాబితాను యూపీ అధికారులు సిద్ధం చేస్తుండటంతో పాటు ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కనికా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకుని, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

click me!