బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి

Published : Mar 20, 2020, 05:53 PM IST
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు.


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు.

రాష్ట్రంలోని విరుదుననగర్ జిల్లా సిప్పిపారెయ్ వద్ద ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఎందుకు పేలుడు సంభవించిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?