Uttar Pradesh: ఆ ఉత్తర్వులను రద్దు చేసిన యూపీ సర్కార్.. ఇకపై రాత్రి 8 తర్వాత కూడా..

By Rajesh Karampoori  |  First Published Dec 13, 2023, 5:59 AM IST

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Govt) వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. గతంలో నోయిడాలో రాత్రి 8 గంటల తర్వాత కోచింగ్‌ సెంటర్లు నిర్వహించరాదని, ప్రధానంగా రాత్రి 8 గంటల తర్వాత బాలికలకు తరగతులను నిర్వహించరాదని విధించిన నిషేధాన్ని రాష్ట్రప్రభుత్వం ఎత్తివేసింది. 


Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Govt) జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. నోయిడాలో రాత్రి 8 గంటల తర్వాత కోచింగ్‌ సెంటర్లు నిర్వహించరాదని , ప్రధానంగా రాత్రి 8 గంటల తర్వాత బాలికలకు తరగతుల నిర్వహణపై విధించిన నిషేధాన్ని రాష్ట్రప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా బాలికలు చదివే కోచింగ్ సెంటర్లలో ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది.

రాత్రి 8 గంటల తర్వాత తరగతులు నిర్వహించరాదని,  ఈ మేరకు సంబంధించి కోచింగ్ ఆపరేటర్లందరికీ నోటీసులు కూడా పంపారు. దీంతో నోయిడాల్లో విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో డిసెంబర్‌ 4న ప్రత్యేక కార్యదర్శి అఖిలేశ్‌ కుమార్‌ మిశ్రా సంతకంతో కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో జారీ చేసిన  మార్గదర్శకాలను రద్దు చేస్తూ .. నూతన మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Latest Videos

CCTV కెమెరాల ఏర్పాటు

ఇప్పుడు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలు నాణ్యమైనవని, కనీసం ఐదేళ్లపాటు గ్యారెంటీ ఉంటుందని తెలిపారు. సేఫ్‌ సిటీ ప్రాజెక్టు కింద అన్ని ఉన్నత విద్యా సంస్థలు 100 శాతం సీసీటీవీ కెమెరాలు ఉండేలా చూడాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

విద్యా సంస్థల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలతో పాటు క్యాంపస్‌, బోధనా తగరగతి గదులు, గ్యాలరీ, ప్రధాన ద్వారం, హాస్టళ్లలో సీసీటీవీలు అమర్చాలని సూచించారు. ముఖ్యంగా కోచింగ్‌ సెంటర్లలో బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 

click me!