Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ లో బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. శివరాజ్ సింగ్ స్థానంలో మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మరోవైపు మాజీ సీఎం శివరాజ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత బీజేపీ తన కొత్త సీఎంను ప్రకటించింది. ఎమ్మెల్యే మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేస్తూ బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తొలుత ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ పేరును తీసుకుంటున్నప్పటికీ ఊహాగానాలన్నీ ఫలించలేదు.
మోహన్ యాదవ్‌ను సీఎంగా ప్రకటించిన మరుసటి రోజే శివరాజ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న పనులను శరవేగంగా పూర్తి చేస్తుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉందని రాష్ట్ర మాజీ సీఎం అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, మధ్యప్రదేశ్ పురోగతి,అభివృద్ధి పరంగా కొత్త శిఖరాలకు చేరుకుంటుందని పేర్కొన్నారు.
శివరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
మంగళవారం నాడు చౌహాన్ తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను వినయంతో ఒక విషయం చెబుతున్నాననీ, తను ఏదైనా అడగడానికి ముందు చనిపోవడానికి ఇష్టపడతాననీ, కానీ..తాను ఢిల్లీకి వెళ్లను అని స్పష్టం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత శివరాజ్ సింగ్ ఢిల్లీ వెళ్లడానికి బదులు చింద్వారా వెళ్లారు. చింద్వారా ప్రాంతంలో బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తన చర్య ద్వారా ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
కేంద్ర నాయకత్వం తనకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేసిందని శివరాజ్ అన్నారు. పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా, తాను ప్రజలకు కూడా కృతజ్ఞుడను, వారు నన్ను వారి స్వంత వ్యక్తిగా అంగీకరించారు. అలాగే, లాడ్లీ బెహనా వంటి పథకాన్ని రూపొందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేబినెట్ సహచరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని శివరాజ్ అన్నారు. శివరాజ్ సింగ్ సీఎం పదవి కోల్పోవడంతో ఆయన మద్దతుదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇంతలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొందరు మహిళలు శివరాజ్‌ని కౌగిలించుకుని ఏడుస్తూ కనిపించారు.