దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కంప్లీట్ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ వారం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గేవరకు ప్రతి వారం శని, ఆదివారాలతో వీకెండ్ లాక్‌డౌన్ విధించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
undefined
Also Read:ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్: 24 గంటల్లో 1761 మంది మృతి
ముందుగా రాబోయే శని, ఆదివారాలతో వీకెండ్ లాక్‌డౌన్‌ను ప్రారంభించనున్నట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ అవానిస్ కే అవస్థి తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. లాక్‌డౌన్ వున్న సమయంలో కేవలం అత్యావసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నది.