హ్యాట్సాఫ్ : కోవిడ్ సెంటర్ గా మారిన మసీదు.. ! 50 పడకలతో చికిత్స.. !!

By AN TeluguFirst Published Apr 20, 2021, 12:56 PM IST
Highlights

రోజురోజుకూ దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విజృంభణను అడ్డుకోలేకపోతున్నాం. దీంతో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

రోజురోజుకూ దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విజృంభణను అడ్డుకోలేకపోతున్నాం. దీంతో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సీజన్ అవసరమైన పేషంట్లు కూడా బెడ్స్ లేక మృత్యువాత పడుతున్న సంఘటనలు నమోదవుతున్నాయి. మరోవైపు ఇంట్లోనే ఐసీయూ సెటప్ చేసి చికిత్స అందిస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి.

ఇలాంటి భయంకర పరిస్థితుల నేపథ్యంలో  గుజరాత్, వడోదరలోని ఓ మసీదు స్ఫూర్తి దాయకమైన నిర్ణయంతో అందరి మెప్పునూ పొందుతుంది. ఈ నిర్ణయంతో 
వడోదర లోని జహంగీర్ పురా మసీదు నిర్వాహకులు ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్నారు. 

వీరు జహంగీర్ పురా మసీదును కోవిడ్ సెంటర్ గా మార్చి వేశారు. ఈ సందర్బంగా మసీదు నిర్వాహకులు ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసీదు కంటే మంచి సదుపాయాలు ఎక్కడా ఉండవు అన్నారు. 

ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనికి మద్దతుగా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మేము గుర్తించాం.. అందుకే మసీదును కోవిడ్ సెంటర్ గా మార్చామని చెప్పుకొచ్చారు.

ఈ మసీదులో 50 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్సను అందించవచ్చు. దీంతో వీరి నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!