సీఈసీకి కరోనా: హోంక్వారంటైన్ లో సుశీల్ చంద్ర

By narsimha lodeFirst Published Apr 20, 2021, 12:27 PM IST
Highlights

భారత ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్రకు కరోనా సోకింది.  ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడ కరోనా బారినపడ్డారు. వీరంతా హోంక్వారంటైన్ లోకి వెళ్లారు. 

న్యూఢిల్లీ: భారత  ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్రకు కరోనా సోకింది.  ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడ కరోనా బారినపడ్డారు. వీరంతా హోంక్వారంటైన్ లోకి వెళ్లారు. 
 ఈసీ కార్యాలయంలో పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగులు కూడ కరోనా బారినపడినట్టుగా అధికారవర్గాలు తెలిపాయి. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

 సునీల్ ఆరోరా సీఈసీగా రిటైర్ కావడంతో ఇటీవలనే సుశీల్ చంద్ర సీఈసీగా ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. గత వారం మాత్రమే  సీఈసీగా సునీల్ ఆరోరా రిటైరైన విషయం తెలిసిందే.సుశీల్ చంద్ర 2019 ఫిబ్రవరి 14న ఎన్నికల కమిషనర్ గా నియమింపబడ్డారు. 2022 మే 14న ఆయన రిటైర్ కానున్నారు.

గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్,పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీకి సుశీల్ చంద్ర సీఈసీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి మాసంలో ఈ రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి పూర్తి కానుంది.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది మే 14వ తేదీకి ముగియనుంది. 
 

click me!