ఉత్తరప్రదేశ్‌లో తొలి జికా వైరస్ కేసు.. ఐఏ‌ఎఫ్ ఆఫీసర్‌కు పాజిటివ్‌.. పరీక్షలకు మరో 200 శాంపిల్స్..

By team teluguFirst Published Oct 25, 2021, 10:20 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పడిప్పుడే కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో భయం పట్టుకుంది. కాన్పూర్ జిల్లాలో తొలి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఓ వారెంట్‌ ఆఫీసర్‌కు శనివారం జికా వైరస్ సోకినట్టుగా నిర్దారణ అయిందని  వైద్యాధికారులు చెప్పారు. 

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పడిప్పుడే కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో భయం పట్టుకుంది. కాన్పూర్ జిల్లాలో తొలి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఓ వారెంట్‌ ఆఫీసర్‌కు శనివారం జికా వైరస్ సోకినట్టుగా నిర్దారణ అయిందని  వైద్యాధికారులు చెప్పారు. ఈ ఉత్తరప్రదేశ్‌లో  మొదటిదని తెలిపారు. దీంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. జికా వైరస్ కేసు వెలుగుచూడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం కాన్పూర్ బయలుదేరింది. 

ఇందుకు సంబంధించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేపాల్ సింగ్ మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్‌పోర్స్‌లో పనిచేస్తున్న సదరు అధికారి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం జిల్లాలోని ఎయిర్‌ఫోర్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే లక్షణాలు అంతుచిక్కకపోవడంతో.. రక్త నమూనాను సేకరించి సరైన పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాం. అక్కడ ఆయనకు జికా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది’అని చెప్పారు. ఈ మేరకు శనివారం తమకు నివేదిక అందిందని అన్నారు. 

జికా వైరస్ సోకిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల నుంచి, ఇదే విధమైన లక్షణాలతో బాధపడుతున్న వారి నుంచి సేకరించిన దాదాపు 200 శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పుణెలోని ఎన్‌ఐవీకి పంపించారు. శాంపిల్స్ సేకరించిన వ్యక్తులును వారి వారి ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంచారు. జికా వైరస్ వ్యాప్తిని అంచనా వేయడానికి ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం కాన్పూర్‌కు బయలుదేరింది. 

ఇక, ఈ ఘటనతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటుగా ఇతర శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జిల్లాలో జికా వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి పలు బృందాలను కూడా నియమించినట్టుగా అధికారులు తెలిపారు. ఐఏఎఫ్ అధికారి తొలుత చికిత్స తీసుకున్న ఎయిర్‌ఫోర్స్‌ హాస్పిటల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ‌

Also read: మహిళా ఉద్యోగినిపై ఏలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ లైంగిక వేధింపులు.. దిశా పోలీసులకు ఫిర్యాదు..

డిస్ జాతి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికున్ గున్యాలు కూడా ఈ దోమల ద్వారానే వ్యాపిస్తాయి. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. జికా ఇన్ఫెక్షన్‌ మరీ అంతగా ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల జికా వైరస్‌ సంబంధిత కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. 

click me!