గో మూత్రం తాగండి, నేనూ తాగుతున్నా.. కరోనాకు విరుగుడు చెప్పిన బిజెపి ఎమ్మెల్యే

Published : May 10, 2021, 09:25 AM ISTUpdated : May 10, 2021, 09:26 AM IST
గో మూత్రం తాగండి, నేనూ తాగుతున్నా.. కరోనాకు విరుగుడు చెప్పిన బిజెపి ఎమ్మెల్యే

సారాంశం

రోజురోజుకూ కరోనా వైరస్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. కరోనా రాకుండా ఉండాలని, వైరస్ నుంచి తప్పించుకోవాలని అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ ప్రయత్నాలు వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు.

రోజురోజుకూ కరోనా వైరస్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. కరోనా రాకుండా ఉండాలని, వైరస్ నుంచి తప్పించుకోవాలని అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ ప్రయత్నాలు వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు.

ముక్కులో నిమ్మరసం పిండుకోవడం, ద్రవరూపంలోని వెండిని తాగడం.. గోమూత్రం తాగడం.. ఇలాంటివే ఎన్నో. వీటివల్ల ప్రాణాలు పోతున్నాయి. వీటిని నమ్మొద్దని ఇలాంటివన్నీ ఫేక్ అని ఎన్నో సంస్థలు పరిశోధనాత్మకంగా చెబుతున్నా మళ్లీ మళ్లీ అలాంటివే తెరమీదికి వస్తున్నాయి. 

తాజాగా ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లా బైరియా నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ విచిత్రమైన సూచన చేశారు. ఖాళీ కడుపుతో ఉదయాన్నే గో మూత్రం తాగితే వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. తాను అదే చేసినట్లు చెప్పారు. 

అంతేకాక గోమూత్రం తాగుతున్న వీడియోను పోస్ట్ చేశారు. 50 మిల్లీ లీటర్ల గో మూత్రాన్ని చల్లటి నీటిలో  కలిపి తీసుకుంటే, రోజూ తీసుకుంటే, సహజ సిద్ధమైన రోగనిరోధకత వస్తుందని సురేంద్ర సింగ్ అందులో పేర్కొన్నారు.

రోజుకు 18 గంటలు ప్రజల్లో ఉండే తాను ఇంతవరకు కరోనా బారిన పడలేదంటే అందుకు ఇదే కారణమని వివరించారు. ‘సందేహంలేదు. శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నా, లేకుంన్నా కొవిడ్‌ నుంచి గో మూత్రమే రక్ష’  అని వీడియోలో వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !