పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్..!

By telugu news teamFirst Published May 10, 2021, 8:44 AM IST
Highlights

ప్రతిరోజూ దాదాపు 4లక్షల కేసులు నమోదౌతున్నాయంటనే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.


దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ దాదాపు 4లక్షల కేసులు నమోదౌతున్నాయంటనే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

కాగా.. తాజాగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయన ఆదివారం ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రంగస్వామి నాలుగు రోజుల క్రితం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

 

click me!