మత సంస్కర్త శ్రీమంత శంకరదేవా తాత్వికతపై అధ్యయనం.. యూఎస్‌టీఎంలో చైర్ ఏర్పాటు చేస్తామన్న చాన్సిలర్ మహబూబల్ హక్

Published : Apr 30, 2023, 01:22 PM ISTUpdated : Apr 30, 2023, 02:14 PM IST
మత సంస్కర్త శ్రీమంత శంకరదేవా తాత్వికతపై అధ్యయనం.. యూఎస్‌టీఎంలో చైర్ ఏర్పాటు చేస్తామన్న చాన్సిలర్ మహబూబల్ హక్

సారాంశం

సాంఘిక, మత సంస్కర్త శ్రీమంత శంకరదేవా ఫిలాసఫీపై అధ్యయనం, ప్రచారం చేయడానికి ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రైవేట్ యూనివర్సిటీ యూఎస్‌టీఎం ఓ శాఖను ఏర్పాటు చేయబోతున్నదని వర్సిటీ వ్యవస్థాపకుడు, చాన్సిలర్ మహబూబల్ హక్ తెలిపారు. శ్రీమంత శంకరదేవా 15వ, 16వ శతాబ్దానికి చెందిన మత సంస్కర్త, అధ్యయనకారుడు, కళాకారుడు.  

గువహతి: అసోంకు చెందిన 15వ-16వ శతాబ్దపు సాంఘిక, మత సంస్కర్త శ్రీమంత శంకరదేవ గురించి పలు యూనివర్సిటీలు బోధించనున్నాయి. ఇటీవలే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆయన బోధనలను, నయా వైష్ణవ తాత్వికతను ప్రచారం చేయడానికి ప్రత్యేక శాఖ ఒకటి ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఈశాన్య రాష్ట్రాల్లోనే పేరుగాంచిన ప్రైవేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయా(యూఎస్‌టీఎం)లోనూ చైర్స్ ఏర్పాట చేయబోతున్నట్టు యూనివర్సిటీ ఫౌండర్, చాన్సిలర్ మహబూబల్ హక్ వెల్లడించారు. 

విశ్వభారతి,బనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీల్లో అసోం ప్రభుత్వం ఇందుకు సంబంధించి చైర్స్ ఏర్పాటు చేయబోతున్నది.

శ్రీమంత శంకరదేవ సాధువు, అధ్యయనకారుడు, కవి, రచయిత, నృత్యకరుడు, సంగీతకారుడు, కళాకారుడు, సాంఘిక, మత సంస్కర్త. అసోం సమాజం, సంస్కృతికి ఆయన ఏకశరణ తత్వం, బోధనలే పునాదిగా చెప్పొచ్చు. ఈయన గురించి, ఈయన బోధనల గురించి ప్రచారం చేయడానికి, అవగాహన తీసుకురావడానికి యూఎస్‌టీఎంలోనూ ఒక శాఖను ఏర్పాటు చేయడానికి మహబూబల్ హక్ సర్వం సిద్ధం చేశారు. మహబూబల్ హక్ నిర్ణయాన్ని యూపీలో మజూలీలోని కమలాబరి సత్ర గురువు జనార్దన్ దేవ్ గోస్వామి కూడా సమర్థించారు. సత్రాలు నయా వైష్ణవుల మఠాలు. శంకరదేవా ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన మఠమే యూపీలోని కమలాబరి ఔనియతి సత్ర. ఈ సత్రాధికారి జనార్దన్ దేవ్ గోస్వామి.

ఇటీవలే ఆయన యూఎస్‌టీఎం సందర్శించి హక్‌తో చర్చ జరిపారు. యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సత్రీయ సంస్కృతి గురించి తాము యూఎస్‌టీఎంతో కలిసి పరిశోధనలు చేస్తామని వివరించారు. ఇందుకు సంబంధించి చర్చలు జరిగాయని చెప్పారు. అసోం ప్రజలకు శ్రీమంత శంకరదేవ ఫిలాసఫీ గురించి మంచి అవగాహన ఉన్నదని తెలిపారు. కాబట్టి విశ్వ సహోదరభావ సూత్రాలు కనిపించే శంకరదేవ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని విస్తరించాల్సి ఉన్నదని చెప్పారు. నయా వైష్ణవానికి సంబంధించిన తత్వం, సాహిత్యానికి విశ్వ ఆమోదం ఉన్నదని పేర్కొన్నారు.

Also Read: ఆడవారు జాకెట్ వేసుకోకపోవడమే ఇండియన్ కల్చర్... సింగర్ చిన్మయి శ్రీపాద మరో వివాదం..

జుంబా నృత్య ఆగమనానికి ముందే శ్రీమంత శంకరదేవ నృత్యాన్ని పరిచయం చేశారని, మాతి అఖోరా (ఒక నృత్య రూపం) చేస్తే ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి అంశాలను పరిశోధించి వెలికి తీసి ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని వివరించారు. ఇప్పుడు పర్యావరణ మార్పులు, అటవీకరణ గురించి మాట్లాడుతున్నామని, కాని, శ్రీమంత శంకరదేవ 600 ఏళ్ల క్రితమే అడవి, పర్యావరణం పై దృష్టి పెట్టారని తెలిపారు. అందుకే ఆయన ఒక చెట్టు పది మంది పిల్లలతో సమానం అని బోధించారని చెప్పారు.

తమ యూనివర్సిటీ లో శ్రీమంత శంకరదేవ చైర్‌ ను ఏర్పాటు చేసి శ్రీమంత శంకరదేవ, మాధవ్‌దేవాల ఫిలాసఫీని అధ్యయనం చేసి ప్రచారం చేస్తామని మహబూబల్ హక్ తెలిపారు. త్వరలో నే తుది భేటీలో మళ్లీ కలుస్తామని చెప్పారు. 

 

(ఈ కథనం తొలుత ఆవాజ్ ది వాయిస్ అనే న్యూస్ పోర్టల్‌లో ప్రచురితమైంది. ఆశా ఖోసా ఈ వార్తను రాశారు)

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..