తల ఒక బ్యాగులో, శరీరం మరో బ్యాగులో.. మైనర్ భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్త..

Published : Apr 30, 2023, 12:05 PM IST
తల ఒక బ్యాగులో, శరీరం మరో బ్యాగులో.. మైనర్ భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్త..

సారాంశం

ఓ వ్యక్తి మైనర్‌ను వివాహం చేసుకోవడమే కాకుండా.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తలను ఒక బ్యాగులో, మిగిలిన శరీరాన్ని మరో బ్యాగులో పెట్టి అడవిలో పడేశాడు.

త్రిపురలోని అగర్తలాలో దారుణం చేసుకుంది. ఓ వ్యక్తి మైనర్‌ను వివాహం చేసుకోవడమే కాకుండా.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తలను ఒక బ్యాగులో, మిగిలిన శరీరాన్ని మరో బ్యాగులో పెట్టి అడవిలో పడేశాడు. వివరాలు.. ఓ 15 ఏళ్ల బాలికకు కయెమ్ మియాతో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. వారు ప్రస్తుతం ముస్లింపారా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. అయితే బాలిక కనిపించకుండా పోయిందనే విషయం తెలసుకున్న ఆమె తల్లి వెంటనే.. ముస్లింపారా ప్రాంతానికి చేరుకుంది. ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 

అయితే బాధిత బాలిక నివాసం ఉంటున్న ఇంట్లో రక్తపు మరకలు కనిపించాయి. మరోవైపు బాలిక భర్త కయెమ్ మియా కూడా కనిపించకుండా  పోయాడు. దీంతో బాధిత బాలిక తల్లి ఆందోళనకు గురైంది. కన్నీరు పెట్టుకుంటూ గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎస్‌డిపిఓ ఆశిష్ దాస్‌గుప్తా నేతృత్వంలోని పోలీసు బృందం అక్కడికి చేరుకుని వివరాలు సేకరించింది. అనంతరం పోలీసులు కయెమ్ మియా కోసం వెతకడం ప్రారంభించారు. గంటల తరబడి గాలింపు చేపట్టిన తర్వాత కయెమ్‌ను పోలీసులు పట్టుకున్నారు.

Also Read: ‘‘సమత’’అత్యాచారం, హత్య కేసు.. దోషులకు మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు..

కయెమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతని భార్యను చంపిన నేరాన్ని అంగీకరించాడు. గురువారం రాత్రి తన భార్యను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను రెండు బ్యాగులో అడవిలో ఉంచినట్లు పోలీసుల విచారణలో కయెమ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు కయెమ్‌పై కేసు నమోదు చేశారు. అతడు చెప్పిన చోటుకు వెళ్లి.. బాలిక శరీర భాగాలతో కూడిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..