సీఎం కుమార్తెకు కుచ్చుటోపీ.. ముగ్గురు నిందితులు అరెస్ట్

By telugu news teamFirst Published Feb 15, 2021, 8:47 AM IST
Highlights

సీఎం కుమార్తె అయిన హర్షితను మోసగించిన సైబర్ నేరగాళ్లు కపిల్, సాజిద్, మానవేంద్రలను  పోలీసులు అరెస్టు చేశారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితను ఆన్ లైన్ కొందరు వ్యక్తులు మోసం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం కుమార్తె అయిన హర్షితను మోసగించిన సైబర్ నేరగాళ్లు కపిల్, సాజిద్, మానవేంద్రలను  పోలీసులు అరెస్టు చేశారు. ఈ కామర్స్ సైట్ లో నకిలీ ఖాతాలతో బురిడీ కొట్టిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఆన్‌లైన్‌లో తన సెకండ్ హ్యాండ్ సోఫాను విక్రయిస్తుండగా, సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.34 వేలను మోసం చేసి తన ఖాతాలోకి వేసుకున్నారు. ఈ మోసంపై సీఎం కుమార్తె హర్షిత ఢిల్లీలోని సివిల్ లైన్సు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సీఎం కుమార్తె విక్రయానికి పెట్టిన సోఫాను కొంటానని తాను కస్టమర్‌నంటూ ఓ సైబర్ నేరగాళ్లు ముందుగా ఆమె ఖాతాలోకి కొంత డబ్బు పంపించాడు. తర్వాత బార్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేయమని కోరాడు. హర్షిత బార్ కోడ్ స్కాన్ చేయగానే ఆమె బ్యాంకు ఖాతా నుంచి 20వేలరూపాయలు డెబిట్ అయ్యాయి. అనంతరం పొరపాటున తప్పు బార్ కోడ్ పంపించానని, మరో బార్ కోడ్ పంపించి దీన్ని స్కాన్ చేస్తే సోఫా డబ్బు మీ ఖాతాలో పడుతుందని చెప్పారు. రెండోసారి బార్ కోడ్ స్కాన్ చేయగా మరో సారి 14వేల రూపాయలు హర్షిత ఖాతా నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

click me!