గురుద్వారాలో ఈ అమెరికన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

Published : Jan 16, 2023, 12:20 PM IST
 గురుద్వారాలో ఈ అమెరికన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

సారాంశం

 గురుద్వారాకు వచ్చి.. ఒక రోజంతా సేవ చేయడం  లాంటివి ఎవరైనా చేస్తారు. ఎవరైనా నో అనే చెబుతారు. కానీ... ఓ వ్యక్తి చేశాడు. అమెరికా నుంచి వచ్చి... గురుద్వారా లంగర్ తయారీలో ఒకరోజంతా సహాయం చేశాడు. 

మన దేశాన్ని ప్రతి సంవత్సరం చాలా మంది విదేశీయులు సందర్శిస్తూ ఉంటారు. మన దేశానికి సందర్శనకు వచ్చేవారు ఏం చేస్తారు..? తాజ్ మహల్, చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలను చూస్తారు. లేదంటే... గోవా లాంటి బీచ్ ఏరియాలకు వెళతారు. కానీ... గురుద్వారాకు వచ్చి.. ఒక రోజంతా సేవ చేయడం  లాంటివి ఎవరైనా చేస్తారు. ఎవరైనా నో అనే చెబుతారు. కానీ... ఓ వ్యక్తి చేశాడు. అమెరికా నుంచి వచ్చి... గురుద్వారా లంగర్ తయారీలో ఒకరోజంతా సహాయం చేశాడు. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతుండటం విశేషం.

 

సరే, ఈటాన్ బెర్నాథ్ అనే ఈ US బ్లాగర్... ఇటీవల మన దేశానికి వచ్చాడు. పాత ఢిల్లీలోని గురుద్వారాలో ఒక రోజు సహాయంగా పని చేయడం ద్వారా భారతదేశ పర్యటనను ప్రత్యేకంగా మార్చుకున్నాడు. గురుద్వారా వంటగదిలో ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు సాగుతున్నప్పుడు ఈటాన్‌పై ఒక సిక్కు వ్యక్తి కండువా కట్టుకోవడంతో వీడియో ప్రారంభమవుతుంది. రోటీలు తయారు చేయడంలో సహాయం చేశాడు. అక్కడ రోటీలు తయారు చేసే యంత్రాన్ని కూడా  అతను వీడియోలో చూపించడం విశేషం. కాగా... ఈ వీడియోకి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు 76వేలకు పైగా లైకులు రావడం విశేషం.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం