ఢిల్లీలో దారుణం.. స్క్రాప్ దొంగిలించాడనే అనుమానం వ్యక్తిని కొట్టి చంపారు..

Published : Jan 16, 2023, 12:04 PM IST
ఢిల్లీలో దారుణం.. స్క్రాప్ దొంగిలించాడనే అనుమానం వ్యక్తిని కొట్టి చంపారు..

సారాంశం

బుద్దవిహార్ ప్రాంతంలోని చెరువు సమీపంలో మృతదేహం పడి ఉన్నట్లు గురువారం పోలీసులకు సమాచారం అందింది. చనిపోయిన వ్యక్తిని దీపుగా గుర్తించారు.   

న్యూఢిల్లీ : వాయువ్య ఢిల్లీలోని విజయ్‌ విహార్‌లోని తమ దుకాణాన్ని దోచుకోవడానికి చొరబడిన వ్యక్తిని కొట్టి చంపినందుకు ఓ స్క్రాప్ డీలర్ తో పాటు అతని దగ్గర పనిచేస్తున్న ముగ్గురు కార్మికులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్దవిహార్ ప్రాంతంలోని ఓ చెరువు సమీపంలో ఓ మృతదేహం పడి ఉన్నట్లు గురువారం పోలీసులకు సమాచారం అందింది. 

ఆ మృతదేహం దీపు అనే వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. దీపు వీపు, కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. విచారణలో, దీపూ మద్యానికి బానిస అని, అతని మృతదేహం కనుగొనబడటానికి రెండు రోజుల ముందు జనవరి 10న రాత్రి 9 గంటలకు చివరి సారిగా అతడిని చూశామని దీపు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

కొడుకు పుట్టాడని మొక్కు చెల్లించేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..విమాన ప్రమాదంలో మరణించిన యూపీ వాసి కథ విషాదం

జనవరి 10వ తేదీన దీపు, అతని స్నేహితుడు నవీన్‌లు స్క్రాప్ డీలర్ సుదీప్ గుప్తా దుకాణంలో చోరీ చేయాలనే ఉద్దేశంతో శ్యామ్ కాలనీకి వెళ్లారు. అతని స్నేహితుడు బయట కాపలా ఉండగా దీపు లోపలికి చొరబడ్డాడని పోలీసులు తెలిపారు. “మరుసటి ఉదయం 6 గంటలకు, ఒక స్క్రాప్ వెండర్ తలుపు తట్టాడు. దీపు సమాధానం చెప్పాడు. దీంతో వచ్చినతనికి కొత్త వ్యక్తిమీద అనుమానం వచ్చింది. వెంటనే గట్టిగా కేకలు వేశాడు. 

విక్రేత అరుపులతో షాపులో నిద్రిస్తున్న ముగ్గురు కార్మికులు రాజీవ్, కౌశల్, విష్ణులు లేచారు. ముగ్గురూ దీపును పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. ఆ తరువాత సమాచారాన్ని షాపు యజమాని సుదీప్‌కు ఫోన్ చేసి చెప్పారు. అతను కూడా అక్కడికి చేరుకుని దీపును కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన దీపు అక్కడికక్కడే మృతి చెందాడు’’ అని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu