కేరళ లో యువతి పెళ్లి... అంతా రాష్ట్రపతి చలువే

By telugu teamFirst Published Jan 7, 2020, 12:18 PM IST
Highlights

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారిని పెళ్లి రద్దు చేసుకోవాలని  ఆమెకు అధికారులు సమాచారం అందించారు. బంధువులను పెళ్లి ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అధికారులు చెప్పిన మాటలకు ఆమె షాకయ్యింది. 


పెళ్లి అనగానే అందరూ ఎన్నో కలలు కంటారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి.. ఏ నగలు ధరించాలి..? ఏ మండపంలో పెళ్లి చేసుకోవాలి లాంటి ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటారు. అన్నీ ఏర్పాట్లు చేసుకొని.. బంధువులందరినీ ఆహ్వానించడం కూడా అయిపోయిన తర్వాత తమ ప్రమేయం లేకుండా పెళ్లి రద్దు అయిపోతే.. ఎలా ఉంటుంది... ఓ అమ్మాయి విషయంలో ఇదే జరిగింది.. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా... అధికారులు బాంబు పేల్చారు. అయితే... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహాయంతో... ఆమె పెళ్లి అనుకున్న తేదీకి జరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూఎస్ కు చెందిన ఆశ్లే హల్  అనే మహిళ కేరళలో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. జనవరి 7వ తేదీన ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కొచ్చిలోని తాజ్ హోటల్ లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే... అదే రోజున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనకు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. 

AlsoReadఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి... మహిళపై బీజేపీనేత అత్యాచారం...

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారిని పెళ్లి రద్దు చేసుకోవాలని  ఆమెకు అధికారులు సమాచారం అందించారు. బంధువులను పెళ్లి ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అధికారులు చెప్పిన మాటలకు ఆమె షాకయ్యింది. పెళ్లి ఆగకుండా ఏలా చేయాలా అని తెగ ఆలోచించిన ఆమె... ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి సమాచారం అందించింది.

కాగా... ఆమె అభ్యర్థనకు కోవింద్ స్పందించారు.ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆమె పెళ్లి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. పెళ్లి తేదీ మార్చుకోవాల్సిన అవసరం లేదని.. అనుకున్న తేదీకే ఆమె వివాహం జరగాలని ఆదేశించారు. ఇందుకు ఆయన భద్రతా బలగాలను తగ్గించాలని సూచించారు.

అధికారులు కూడా స్థానికంగా స్థానికంగా పరిస్థితిని విశ్లేషించి రాష్ట్రపతి పర్యటనకు, పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. సమస్య పరిష్కరమైనందుకు సంతోషంగా ఉందని తెలిపిన రాష్ట్రపతి నూతన వధువరులను ఆశీర్వదించి... శుభాకాంక్షలు తెలిపారు.కాగా కేరళ పర్యటన నిమిత్తం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొచ్చికి చేరుకున్నారు. అనంతరం తాజ్‌ హోటల్‌లో బస చేసిన ఆయన మంగళవారం  లక్షద్వీప్‌కు చేరుకోనున్నారు. 

click me!