ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి... మహిళపై బీజేపీనేత అత్యాచారం

By telugu teamFirst Published Jan 7, 2020, 10:46 AM IST
Highlights

ఆ బీజేపీ నేత కన్ను సదరు దళిత మహిళపై పడింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మించాడు. ఇద్దరికీ మంచి ఉద్యోగం, జీతం ఇస్తానంటూ ఆశ చూపించాడు. ఈ క్రమంలో ఆ దళిత దంపతులు ఇద్దరినీ... కారులో ఎక్కించుకొని వెళ్లాడు. మార్గ మధ్యంలో సదరు మహిళ భర్తకు మద్యం తాగించాడు.
 

ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి... ఓ దళిత మహిళపై బీజేపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు.  కాగా... నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన  మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అశోక్ నగర్ జిల్లాకు చెందిన దేవేంద్ర తమ్రాకర్ బీజేపీ మీడియా ఇన్ ఛార్జీగా పనిచేస్తున్నాడు. దేవేంద్రకు సింగ్రౌౌలీ జిల్లాలో వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలో దళిత మహిళ భర్త కూలీగా పనిచేసేవాడు. 

ఈ క్రమంలో... ఆ బీజేపీ నేత కన్ను సదరు దళిత మహిళపై పడింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మించాడు. ఇద్దరికీ మంచి ఉద్యోగం, జీతం ఇస్తానంటూ ఆశ చూపించాడు. ఈ క్రమంలో ఆ దళిత దంపతులు ఇద్దరినీ... కారులో ఎక్కించుకొని వెళ్లాడు. మార్గ మధ్యంలో సదరు మహిళ భర్తకు మద్యం తాగించాడు.

అతను మత్తులో జారిపోగా... వేరే కారులో భర్తను వేరే ప్రాంతానికి పంపించేశాడు. ఆ తర్వాత మహిళను తన కారులో  ఎవరూ  చూడని ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి... అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ.. ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

AlsoRead చెత్త పేపర్ అని పడేస్తే... అదే కాగితం కోటీశ్వరుడిని చేసింది.....

కాగా... బాధితురాలు  ఈ వివరాలన్నింటినీ పోలీసులకు వివరించింది. అయితే... అత్యాచార ఘటన గురించి పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని దేవేంద్ర బెదిరించాడని బాధిత మహిళ పోలీసులకు వివరించారు. దళిత మహిళ ఫిర్యాదు మేర నిందితుడైన బీజేపీ నేత దేవేంద్రను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చామని సింగ్రౌలీ డీఎస్పీ చెప్పారు.కాగా నకిలీ కుల ధ్రువీకరణ పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దేవేంద్ర ఫిర్యాదు చేశాడనే కోపంతో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని బీజేపీ రాష్ట్ర ‌ఇన్‌చార్జి లోకేంద్ర ఎస్పీకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

click me!