భార్యాభర్తల మధ్య గొడవ: నాలుక కోసుకొన్న భర్త

Published : Mar 15, 2021, 08:42 PM IST
భార్యాభర్తల మధ్య గొడవ: నాలుక కోసుకొన్న భర్త

సారాంశం

తరచూ గొడవ పడే భార్యతో వేగలేక విసుగు చెంది నాలుక కోసుకొన్నాడు. ఈ  ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. రాష్ట్రంలోని కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో నిషా.. ముకేష్ లు భార్యభర్తలు. 

లక్నో: తరచూ గొడవ పడే భార్యతో వేగలేక విసుగు చెంది నాలుక కోసుకొన్నాడు. ఈ  ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. రాష్ట్రంలోని కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో నిషా.. ముకేష్ లు భార్యభర్తలు. 

ముకేష్ వ్యవసాయం చేస్తాడు. అయితే భార్య కొన్ని రోజులుగా  భర్తతో గొడవపడుతోంది. భార్యాభర్తల మధ్య విబేధాలు పెరిగిపోయాయి.  దీంతో నిషా పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం నాడు ముకేష్ భార్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు.

 ఇంటికి వచ్చిన తర్వాత కూడ నిషా భర్తతో గొడవకు దిగింది. కలిసి జీవిద్దామని భర్త ఎంతగా బతిమిలాడినా ఆమె పట్టించుకోలేదు. దీంతో  విసుగు చెందిన ముకేష్ బ్లేడ్ తో తన నాలుక కోసుకొన్నాడు. 

నాలుక తెగి తీవ్రంగా రక్తస్రావమైంది. ఈ గాయాన్ని తట్టుకోలేక ఆయన కేకలు వేయడంతో కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం