ఎల్లుండి సీఎంలతో భేటీ కానున్న మోడీ

Published : Mar 15, 2021, 08:25 PM IST
ఎల్లుండి సీఎంలతో భేటీ కానున్న మోడీ

సారాంశం

ఈ నెల 17వ తేదీన అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

న్యూఢిల్లీ: ఈ నెల 17వ తేదీన అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రధాని సీఎంలతో చర్చించనున్నారు. దేశంలో ఇవాళ ఒక్క రోజే 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. చాలా కాలం తర్వాత  దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని సూచించే అవకాశం ఉంది.

వర్చువల్ మీటింగ్ ద్వారా మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు.. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై  సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశా నిర్దేశం చేయనున్నారు. 

కరోనా కేసుల వ్యాప్తిని  నిరోధించేందుకు గాను ఏ రకమైన వ్యూహన్ని చర్యలపై మోడీ చర్చించనున్నారు. దేశంలోని మహారాష్ట్ర,కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడం  ఆందోళన కల్గిస్తోంది.కరోనా కేసులను తగ్గించే విషయమై  చర్చిస్తారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Performs Yoga: ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో యోగా ఆసనాలు వేసిన మోదీ | Asianet News Telugu
Nirmala Sitharaman: యోగాలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ | Asianet News Telugu