
కేరళ : జుట్టు రాలిపోవడం చాలామందికి పెద్ద సమస్య. ఇది సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్య అయినా.. ఇటీవలి కాలంలో ఈ సమస్య మరింతగా పెరిగిపోతుంది. ఎన్ని మందులు వాడినా, చికిత్సలు తీసుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేరళ కోజికోడ్ లో జుట్టు రాలిపోయే సమస్యతో ఓ యువకుడు మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. చాలా కాలంగా మందులు వాడుతున్నప్పటికీ కనుబొమ్మలు, శరీరంలో ఇతర భాగాలపై వెంట్రుకలు రాలిపోతున్నాయనే మనస్థాపంతో కేరళలోని కోజికోడ్ కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
తన చావుకు కారణాలపై సూసైడ్ లెటర్ రాసి పెట్టాడు. తనకి చికిత్స చేసిన వైద్యుడిని తప్పుపడుతూ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. కోజికోడ్ లో తన ఇంట్లోనే ప్రశాంత్ శవమై కనిపించాడు. జుట్టు రాలిపోవడానికి వైద్యం అందించిన వైద్యుడే తన చావుకు కారణం అని ప్రశాంత్ తన లేఖలో పేర్కొన్నాడు. ఈ సమస్యతో ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను అని లేఖలో ప్రస్తావించారు. జుట్టు రాలిపోతుందనే సమస్యతో 2014 నుంచి సదరు డాక్టర్ వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. డాక్టర్ చెప్పిన మాత్రలు వేసుకున్నా కనుబొమ్మలు, ముక్కు వెంట్రుకలు రాలి పోయాయి. జుట్టు జుట్టు రాలడం ఆగిపోతుందన్న ఆశతో 2020వరకు అంటే ఆరేళ్ల పాటు మందులు వాడినట్లు తెలిసింది.
మగబిడ్డకోసం రెండు పెళ్లిళ్లు.. అయినా కోరిక తీరకపోవడంతో.. దొంగగా మారి..
కానీ, చికిత్సలు తీసుకున్నప్పటికీ, అతని కనుబొమ్మలపై వెంట్రుకలు కూడా తగ్గుతున్నాయి. దీంతో తనను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదని ఆందోళనలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే విసిగిపోయి జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ఆత్మహత్యకు పాల్పడిన ప్రశాంత తన సూసైడ్ నోట్ లో రాశాడు. ప్రశాంత్ కు చికిత్స అందించిన వైద్యుడు రఫీక్ పై అథోలి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే పేరంబ్రా ఏఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎలాంటి నేరం జరగలేదని, తదుపరి విచారణ జరుపుతున్నామని అథోలి ఎస్ఐ తెలిపారు. అలాగే డాక్టర్ని విచారించాలని, అయితే నిందితుడుగా పరిగణించలేదని చెప్పారు. అలాగే పోస్టుమార్టం నివేదిక కోసం కూడా ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.