మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్..

Published : Nov 09, 2022, 01:34 PM ISTUpdated : Nov 09, 2022, 01:41 PM IST
మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్..

సారాంశం

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌‌కు ఊరట లభించింది. పత్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌కు ముంబైలోని స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌‌కు ఊరట లభించింది. పత్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌కు ముంబైలోని స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయనకు దాదాపు మూడు నెలల తర్వాత బెయిల్ లభించింది. ముంబై సబర్బన్ గోరేగావ్‌లోని పాత్రా చాల్‌ను పునరాభివృద్ధికి సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలపై ఎంపీ సంజయ్ రౌత్‌ ఈ ఏడాది జూలైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యూడిషియల్ రిమాండ్‌లో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. 

అయితే ఈ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంజయ్ రౌత్..  తనపై కేసు అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రతీకారానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే సంజయ్ రౌత్ బెయిల్ పిటిషన్‌పై  మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)కి సంబంధించిన కేసులను విచారించేందుకు నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి ఎం జి దేశ్‌పాండే విచారణ చేపట్టారు. సంజయ్ రౌత్ ప్రభావవంతమైన వ్యక్తి అని, ఆయన బయటకు రాగానే సాక్షులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గత వారం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా ఆదేశాలు వెలువరించారు. 

ఇక, రూ. 1,034 కోట్ల పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై 'చాల్' రీ-డెవలప్‌మెంట్‌లో అవకతవకలు, సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్, అతని సహచరులకు సంబంధిత లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో వర్షా రౌత్ ఫ్లాట్‌తో పాటు.. సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్, సుజిత్ భార్య స్వప్న పాట్కర్ సంయుక్తంగా కలిగి ఉన్న ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu