తండ్రి బాటలో తనయుడు.. నూతన సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం.. తొలి సందేశంలో ఏమన్నారంటే..?     

Published : Nov 09, 2022, 01:18 PM ISTUpdated : Nov 09, 2022, 01:30 PM IST
తండ్రి బాటలో తనయుడు.. నూతన సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం..  తొలి సందేశంలో ఏమన్నారంటే..?     

సారాంశం

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నేటీతో సీజేఐ యూయూ లలిత్ పదవీకాలం ముగయనున్నది. దీంతో ఆయన స్థానంలో చంద్రచూడ్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన నవంబర్ 10, 2024 వరకు పదవీలో కొనసాగునున్నారు. 

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయడం నా ప్రాధాన్యత. మేము భారతదేశ పౌరులందరి ప్రయోజనాలను పరిరక్షిస్తాము. అది సాంకేతికత, రిజిస్ట్రీ సంస్కరణలు లేదా న్యాయపరమైన సంస్కరణలు కావచ్చు. అని పేర్కొన్నారు. 

జస్టిస్ డివై చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ దేశ 16వ ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఫిబ్రవరి 22 ,1978 నుండి జూలై 11, 1985 వరకు దాదాపు ఏడేళ్లపాటు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఇప్పటి వరకు సీజేఐకి ఇదే సుదీర్ఘ పదవీ కాలం. తన తండ్రి పదవీ విరమణ చేసిన 37 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐ అయ్యారు. సుప్రీంకోర్టు చరిత్రలో తండ్రి తర్వాత కొడుకు కూడా సీజేఐ అయ్యే అరుదైన అవకాశం చంద్రచూడ్ కు మాత్రమే దక్కింది.    

ఆ విఫయంలో తండ్రి నిర్ణయాన్ని తోసిపుచ్చారు.  

జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పులు చాలా ప్రజాదరణ పొందాయి. వీటిలో 2018 సంవత్సరంలో వివాహేతర సంబంధాలను (వ్యభిచార చట్టం) తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. 1985లో అప్పటి CJI వైవీ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో IPC సెక్షన్ 497ను సమర్థిస్తూ, సంబంధం పెట్టుకోవడానికి బలవంతం చేసేది పురుషుడే తప్ప స్త్రీ కాదు. అదే సమయంలో.. DY చంద్రచూడ్ 2018 తీర్పులో 497 ను తిరస్కరించారు.'వ్యభిచార చట్టం మహిళలకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది,

కానీ వాస్తవానికి ఇది మహిళలకు వ్యతిరేకం. వివాహిత సంబంధంలో, భార్యాభర్తలిద్దరికీ సమాన బాధ్యత ఉంటుంది, అలాంటప్పుడు భర్త కంటే ఒంటరి భార్య ఎందుకు ఎక్కువ బాధపడాలి? వివాహిత పురుషులు , వివాహిత స్త్రీలను వేర్వేరుగా పరిగణిస్తున్నందున వ్యభిచారంపై శిక్షాస్మృతి రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు పరోక్ష ఉల్లంఘన.' అని ఆయన తీర్పులో వెల్లడించారు. 

చంద్రచూడ్ ప్రస్థానం

చంద్రచూడ్ తొలిసారిగా 2000 సంవత్సరంలో న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. అంతకు ముందు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా మొదటి నియామకం జరిగింది. అంతకు ముందు అతను 1998 నుండి 2000 వరకు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశాడు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టా పొందారు. ఆయన ప్రతిష్టాత్మక హోవార్డ్ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నాడు.

కరోనా పాజిటివ్ వచ్చిన కూడా పనిలో  

కోవిడ్ కష్టకాలంలో  ఆయన ఆక్సిజన్,మందుల లభ్యతపై అనేక ఆదేశాలు ఇచ్చాడు. ఆయన కరోనా పడినప్పటికీ .. ఆయన తన ఇంటి నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల రాత్రి 9.10 గంటల వరకు కోర్టు కార్యకలాపాలు నిర్వహించి ఆ రోజు తన ముందున్న కేసులన్నింటినీ పరిష్కరించారు.

తీర్పులో ప్రత్యేకత

ఆయన వ్యక్తిత్వంగా ఎల్లప్పుడూ ఉదారంగా కనిపిస్తారు.వివాహితకు కూడా స్వయంప్రతిపత్తి ఉంటుందని ఐపీసీ సెక్షన్ 497ను రద్దు చేస్తూ సంచలన తీర్పు నిచ్చారు. ఆమెను భర్త ఆస్తిగా చూడలేం. ఆమె మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉండటం విడాకులకు సరైన కారణం కావచ్చు, కానీ మరొక వ్యక్తిని జైలులో పెట్టడం నేరంగా పరిగణించడం తప్పు. అని కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. 

సంచలన తీర్పులు 

ఇటీవల ఆయన పెళ్లికాని మహిళలు గర్భం దాల్చితే.. 24 వారాల వరకు వారి గర్భాన్ని తొలగించుకోవడానికి కూడా అనుమతించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో..భర్త బలవంతంగా సెక్స్ చేసి భార్యను గర్భవతిని చేస్తే, ఆమెకు కూడా 24 వారాల పాటు అబార్షన్ చేసే హక్కు ఉంటుందని చెప్పాడు. ఈ విధంగా అబార్షన్ కేసు చట్టంలో మొదటిసారిగా, వైవాహిక అత్యాచారాన్ని గుర్తించింది.

జస్టిస్ చంద్రచూడ్‌కు భావప్రకటనా స్వేచ్ఛతో సహా అన్ని ప్రాథమిక హక్కుల గురించి కీలక తీర్పును వెలువరించారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా భిన్నమైన కోణాల్లో వ్యక్తులు తమ భావప్రకటనా స్వేచ్చ వెల్లడించే అవకావముందని తెలిపారు. కేవలం అభిప్రాయాలు వెల్లడించిన మాత్రాన జైలులో పెట్టడం సరికాదని తెలిపారు. ఆర్మీలో పర్మినెంట్ కమీషన్ కోసం చాలా కాలంగా పోరాడుతున్న మహిళా అధికారులకు కూడా ఆయన ఉపశమనం కలిగించారు. అయోధ్య కేసు తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా సభ్యుడు. ఆధార్ కేసుపై తీర్పు ఇస్తూ..గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు