
The Kashmir Files: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) సినిమాకు వినోదపన్ను మినహింపు ఇవ్వాలన్న బీజేపీ ఎమ్మేల్యేలు డిమాండ్ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) తనదైన శైలిలో స్పందించారు. కొందరు ఈ సినిమా పేరుతో కోట్లు సంపాదిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పోస్టర్లు అంటించేవారిగా మారిపోయారంటూ విమర్శించారు.
అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అయితే.. ఆ సినిమాను ఫ్రీగా చూడటానికి వీలుగా.. య్యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు కదా! అన్నారు. సినిమాపై వినోద రాయితీ ప్రకటించడం కంటే.. సినిమాను యూట్యూబ్‌లో పెట్టమని వివేక్ అగ్నిహోత్రికు సలహా ఇవ్వండనీ, ఒక్కరోజులో ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూస్తారు. ఎక్కడ కూడా పన్ను కట్టవాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ కామెంట్ చేశారు.
కొందరు ఈ సినిమా పేరుతో కోట్లు సంపాదిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పోస్టర్లు అంటించేవారిగా మారిపోయారంటూ విమర్శించారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ నవ్వులమయమైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపారు.
పన్ను రాయితీ ఇవ్వమని మీరెందుకు అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే.. యూ-ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయమని వివేక్ అగ్నిహోత్రిని అడగండి. అప్పుడు అది అందరికి ఉచితంగా లభిస్తుంది. ఒక్కరోజులోనే ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడొచ్చు. దానికి పన్ను రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడ ఉంది` అని బీజేపీ ఎమ్మెల్యేలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్, త్రిపుర, గోవా, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్‌లతో సహా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రంపై పన్ను రాయితీని ప్రకటించాయి.
సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బిజెపి నాయకుడు బిఎల్ సంతోష్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి గతంలో "నిల్ బట్టే సన్నత్తా, సాండ్ కి ఆంఖ్ లకు పన్ను రహితంగా ప్రకటించారని తెలిపారు. 'యూట్యూబ్‌లో కశ్మీర్ ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయమని వివేకాగ్నిహోత్రికి ఢిల్లీ సీఎం అరవింద్‌కేజ్రీవాల్ సూచించడంపై ఇతర చిత్రాలకు ఇది వర్తించదు.. సిగ్గుపడండి సీఎం.... సిగ్గుపడండి' అంటూ బీఎల్ సంతోష్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. "ది కాశ్మీర్ ఫైల్స్" డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి 'Y' కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు.
కశ్మీర్ లోయలోని పండిట్ల దీనగాధల్ని తెలిపే `ది కశ్మీర్ ఫైల్స్` సినిమా.. మార్చి 11న విడుదలైన ఈచిత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విజవంతంగా ప్రదర్శించబడుతుంది. కలెక్షన్స్ లో ఇప్పటికే రూ.200 కోట్ల మెయిలురాయిని దాటిన “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం..తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటుసంపాదించింది.