‘మరణించిన’ మహిళను స్మశానం తీసుకెళ్లుతుంటే కళ్లు తెరించింది.. ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

Published : Jan 05, 2023, 05:08 PM IST
‘మరణించిన’ మహిళను స్మశానం తీసుకెళ్లుతుంటే కళ్లు తెరించింది.. ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ బ్రెయిన్ డెడ్‌తో మరణించిందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఆమెను స్మశానవాటికకు తీసుకెళ్లుతుండగా ఆమె కళ్లు తెరించింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కానీ, మరుసటి రోజే ఆమె మరణించారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ చనిపోయిందని వైద్యులు డిక్లేర్ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఆమెను స్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యారు. కానీ, స్మశానానికి చేరుతున్న మార్గంలోనే ఆమె కళ్లు తెరించింది. దీంతో కుటుంబ సభ్యులు అంతా షాక్ అయ్యారు. అక్కడి నుంచే ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. కానీ, మరుసటి రోజే ఆ మహిళ మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది.

ఫిరోజాబాద్‌కు చెందిన 81 ఏళ్ల హరిభేజీని డిసెంబర్ 23వ తేదీన ఓ ట్రామా సెంటర్‌లో చేర్పించారు. మంగళవారం ఆమె బ్రెయిన్ పని చేయడం ఆగిపోయింది. ఆమె బ్రెయిన్‌లో రక్తస్రావం జరిగినట్టు కొందరు చెప్పారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. అనంతరం, ఆమె మరణించిందని కూడా స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు దు:ఖితులయ్యారు. ఆమెను స్మశానవాటికకు తీసుకెళ్లడానికి సిద్ధం చేశారు. అంతిమ సంస్కారాల కోసం స్మశాన వాటికకు తీసుకెళ్లుతుండగానే ఆమె కళ్లు తెరిచారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకువచ్చారు.

Also Read: అంత్యక్రియలు జరిగిన మ‌రుస‌టి రోజు 'చనిపోయిన' మహిళ రిట‌ర్న్.. పూడ్చిన శ‌వాన్ని బ‌య‌ట‌కు తీసి..

కానీ, బుధవారం ఆమె కండీషన్ మళ్లీ సీరియస్ అయింది. అదే రోజు మరణించింది. ఈ పరిణామాలపై ఆమె కొడుకు సుగ్రీవ్ సింగ్ మాట్లాడుతూ బుధవారం తన తల్లి మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించామని వివరించాడు. తన తల్లి మంగళవారం బ్రతికి ఉండగానే మరణించిందని వైద్యులు తెలిపారని కొడుకు ఆరోపించాడు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu