ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నగారా.. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్.. రెండు విడతల్లో ఎన్నికలు.. మే 13న ఫలితాలు

Published : Apr 10, 2023, 03:15 AM IST
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నగారా.. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్.. రెండు విడతల్లో ఎన్నికలు.. మే 13న ఫలితాలు

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెలలో రెండు విడతల్లో ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 4, మే 11వ తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. మే 13వ తేదీన ఫలితాలు వెలువడతాయి.  

లక్నో: వచ్చే సంవత్సరం జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధికార,  ప్రతిపక్షాలు ఇప్పటికే ఒక వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అత్యధిక ఎంపీ స్థానాలు గల యూపీ అంటే జాతీయ పార్టీలకు ఆసక్తి ఎక్కువ. ఈ నేపథ్యంలోనే యూపీ సెమీ ఫైనల్‌గా ఊహిస్తున్న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఉత్తరప్రదేశ నగరపాలికల ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మే 4వ తేదీన, మే 11వ తేదీన ఈ ఎన్నికలు జరుగుతాయి. మే 13వ తేదీన ఓట్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తూ తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషనరర్ మనోజ్ కుమార్ తెలిపారు.

మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 199 మున్సిపల్ కౌన్సిల్స్, 439 నగర పంచాయతీలకు కొత్త ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. ఈ సారి అర్బన్ బాడీల సంఖ్య 107 అంటే 653 నుంచి 760కి పెరిగింది.

Also Read: నవజాత శిశువుకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన హాస్పిటల్.. అంత్యక్రియల్లో బేబీలో కదలికలు.. హాస్పిటల్లో మరణం

లక్నో, సహరన్‌పూర్, మొరదాబాద్, ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్‌ రాజ్, దేవీపటన్, గోరఖ్‌పూర్, వారణాసిలకు తొలి విడతగా మే 4వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మీరట్, బరేలీ, అలీగడ్, కాన్పూర్, చిత్రకూట్, అయోధ్య, బస్తీ, ఆజాంగడ్, మీర్జాపూర్‌లలో మే 11వ తేదీన పోలింగ్ జరుగుతంది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..