బాలుడి పెదవిపై దలై లామా ముద్దు.. తన నాలుకను చప్పరించాలని సూచన.. వీడియో వివాదాస్పదం

Published : Apr 10, 2023, 02:06 AM IST
బాలుడి పెదవిపై దలై లామా ముద్దు.. తన నాలుకను చప్పరించాలని సూచన.. వీడియో వివాదాస్పదం

సారాంశం

ఆధ్యాత్మిక గురువు దలై లామా ఓ మైనర్ బాలుడితో అసభ్యంగా వ్యవహరిస్తున్న వీడియో ఒకటి కొత్త వివాదాన్ని రేపుతున్నది. బాలుడి పెదవులపై కిస్ చేసిన దలై లామా తన నాలుకను బయటకు చాచి దాన్ని చప్పరించాల్సిందిగా బాలుడిని కోరారు. ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా ఆ మైక్ ద్వారా వినిపించాయి.  

న్యూఢిల్లీ: బౌద్ధ మత గురువు దలై లామా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మైనర్ బాలుడి పెదవులపై కిస్ చేశారు. అంతేకాదు.. తన నాలుకను బయటకు చాచి.. దాన్ని చప్పరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియో వివాదాస్పదమైంది.

దలై లామా ఏదో ప్రసంగంలో ఉన్నట్టు ఆ వీడియోలో తెలుస్తున్నది. ఆయన వద్దకు ఓ బాలుడు వచ్చాడు. దలై లామాకు ముద్దు పెట్టడానికి ఆ బాలుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ బాలుడి గదవను పట్టుకుని తన వైపు దలై లామా తీసుకున్నారు. ఆ పిల్లాడి పెదవులపై ముద్దు పెట్టారు. ఆ తర్వాత వదిలి పెట్టి కాసేపు నవ్వారు. 

మళ్లీ ఆ బాలుడిని తన ముఖానికి దగ్గరగా తీసుకుని నాలుకను బయటకు చాచారు. తన నాలుకను చప్పరించగలవా? అని బాలుడిని అడిగాడు. ఆ పదాలు మైక్ ద్వారా బయటకు లౌడ్‌గానే వినిపించాయి. 

ఈ వీడియో వివాదాస్పదమైంది. చాలా మంది నెటిజన్లు ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. 

దలై లామా అలా ఎందుకు చేశాడని వీడియో పెట్టిన ఓ యూజర్ పేర్కొన్నాడు. కాగా, ఇది సమంజసం కాదని, ఇలాంటి నడవడికను ఎవరూ సమర్థించరాదని ఇంకొరు కోరారు. మరొకరు ఆ వీడియోను చూసి షాక్ అయ్యాడు. ‘నేను ఏం చూస్తున్నా? ఆయన దలై లామానేనా? పిల్లలను వేధించినందున ఆయనను అరెస్టు చేయాలి. బాధాకరం’ అని మరొకరు కామెంట్ చేశాడు.

Also Read: కోళ్లను భయపెట్టి చంపేశాడని పొరుగింటి వ్యక్తిపై కేసు.. ఆరు నెలల జైలు శిక్ష

2019లోనూ ఆయన ఓ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. తన తర్వాత దలై లామాగా మహిళ వస్తే ఆమె ఎక్కువ ఆకర్షవంతంగా కనిపించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కామెంట్ పై ప్రపంచవ్యాప్తగా వ్యతిరేకత రావడంతో క్షపమాణలు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..