
Uttar Pradesh DGP: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదేశాలు అమలు చేయడం లేదన్న కారణంతో ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ముకుల్ గోయల్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. డిపార్ట్‌మెంటల్ పనులపై ఆసక్తి చూపకపోవడం, ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం వల్లే డీజీపీ పదవి నుంచి రిలీవ్ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకుల్ గోయెల్‌ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపినట్లు సమాచారం. అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ), లా అండ్ ఆర్డర్, ప్రశాంత్ కుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది.
యూపీ డీజీపీ ముకుల్ గోయల్ ఇంతకు ముందు కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అతని వర్కింగ్ స్టైల్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. 2000 సంవత్సరంలో.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నిర్భయ్ పాల్ శర్మ హత్యకు గురైనప్పుడు.. ఆ సమయంలో ముకుల్ గోయల్ SSP గా ఉన్నారు. ఈ హత్య నేపథ్యంలో ఆయన పలు ఆరోపణలు ఉండటంతో.. ఆ పదవి నుండి సస్పెండ్ అయ్యారు. అలాగే.. 2006 నాటి పోలీసు రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో మొత్తం 25 మంది IPS అధికారుల పేర్లు వెల్లడయ్యాయి. ఇందులో ముకుల్ గోయల్ పేరు కూడా ఉంది.
ముకుల్ గోయల్ ఎవరు?
ముకుల్ గోయల్ 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన అనేక ముఖ్యమైన స్థానాల్లో పనిచేశాడు. ముకుల్ గోయల్ 1964 ఫిబ్రవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జన్మించారు. IIT ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్‌లో B.Tech చేయడంతో పాటు, ముకుల్ గోయల్ మేనేజ్‌మెంట్‌లో MBA పట్టా పొందారు. 1987 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి, ముకుల్ గోయల్ మొదటి పోస్టింగ్ నైనిటాల్‌లో అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత బరేలీ SP గా పని చేశారు. ముకుల్ గోయల్ 2021 జూన్ 1న డీజీపీగా నియమితులయ్యారు. దీనికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, ఎన్డీఆర్పీలో ఉన్నారు. అల్మోరా, జలౌన్, మైన్‌పురి, హత్రాస్, అజంగఢ్, గోరఖ్‌పూర్, వారణాసి, సహరాన్‌పూర్, మీరట్ జిల్లాల్లో ఎస్పీ, ఏఎస్పీగా గతంలో పని చేశారు. ఆయనకు ఫ్రెంచ్ భాషపై కూడా విపరీతమైన పట్టు ఉంది.