అవి నకిలీ రూ. 500 నోట్లా... క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Published : May 11, 2022, 08:28 PM ISTUpdated : May 11, 2022, 08:29 PM IST
అవి నకిలీ రూ. 500 నోట్లా... క్లారిటీ ఇచ్చిన కేంద్రం

సారాంశం

సోషల్ మీడియాలో, బయటి సమాజంలోనూ రూ. 500 నోట్లపై ఉన్న వదంతులను పీఐబీ ఫ్యాక్ట్ చెకర్ పటాపంచలు చేసింది. రూ. 500 నోటుపై గ్రీన్ స్ట్రిప్.. మహాత్మా గాంధీ చిత్రానికి దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్నా చెల్లుబాటు అయ్యే నోటేనని వివరించింది.

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో సత్యాలతోపాటు అర్ధసత్యాలు, వదంతులూ ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. కొన్ని సెన్సేషనల్ విషయాలపై అనేక రకాల వదంతులు చక్కర్లు కొడుతుంటాయి. అలాగే, సామాన్య ప్రజలనూ తప్పుదారి పట్టించే విషయాలూ ఉంటాయి. ఉదాహరణకు రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నోట్లపైనా అనేక రకాల తప్పుడు ప్రచారాలు, వాదనలు ప్రచారం అవుతుంటాయి. ఉదాహరణకు రూ. 500 నోటుపై మహాత్మ గాంధీ బొమ్మకు సమీపంగా గ్రీన్ లైన్ ఉంటే అది నకిలీ అని, మహాత్మా గాంధీ బొమ్మకు గ్రీన్ లైన్ దూరంగా ఉంటేనే సరైన నోటు అనే ప్రచారం ఉన్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ వాదనలు అవాస్తవాలని పీఐబీ ఫ్యాక్ట్ చెకర్ వెల్లడించింది.

ట్విట్టర్‌లో పీఐబీ ఈ విషయంపై వివరణ ఇచ్చింది. రూ. 500 నోటుపై మహాత్మా గాంధీ బొమ్మకు గ్రీన్ స్ట్రిప్ దూరంగా ఉంటేనే చెల్లే నోటు అని, ఆ గ్రీన్ స్ట్రిప్ దగ్గరగా ఉంటే ఆ నోటు నకిలీదనే వదంతి ఉన్నది. ఆర్బీఐ గవర్నర్ సంతకంపైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ బొమ్మకు గ్రీన్ స్ట్రిప్ దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్నా ఆ నోటు చెల్లుబాటు అయ్యేదేనని పీఐబీ వివరించింది.

అదే విధంగా ఆ ట్వీట్‌లో ఆర్బీఐ లింక్‌ను పేర్కొంది. అందులో నోటుపై ఉండే వివిధ సింబల్స్‌ను, ఇతర వివరాలను ఆర్బీఐ పొందుపరిచింది.

నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో  మీకు చాలా విషయాలను తెలిసే ఉంటాయి, కానీ మీకు తెలియని  నోటుకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. వీటి సహాయంతో మీరు నోటు నిజమైనదా లేదా నకిలీదా అని చిటికెలో తెలుసుకోవచ్చు... నిజమైన రూ. 2000 నోటును ఇలా గుర్తించవచ్చు.

*నోటు విలువ నోటు  ఎడమ వైపున  దేవనాగరిలో  వ్రాసి ఉంటుంది
*నోట్ మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. 
*ఆర్‌బిఐ జారీ చేసిన నోట్లపై సెక్యూరిటీ థ్రెడ్‌లో - భారత్ 2000 ఆర్‌బిఐ - అనే మూడు పదాలు ఉంటాయి. నోట్ వంగి ఉన్నప్పుడు భద్రతా థ్రెడ్  రంగు ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది.
*మహాత్మా గాంధీ సిరీస్  కొత్త నోట్ పై ఆర్‌బి‌ఐ గవర్నర్ సంతకం ఉంటుంది.
*నోట్ల పై ఒక నంబర్ ప్యానెల్ ఉంటుంది దీనిలో నంబర్లు చిన్న నుండి పెద్ద వరకు  వ్రాసి ఉంటుంది
*ఆర్‌బిఐ జారీ చేసిన నోట్లకు నిర్ణీత సైజ్ ఉంటుంది. 2000 రూపాయల నోటు సైజ్ 66×166 ఎం‌ఎం. 
*నోట్  కుడి వైపున అశోక పిల్లర్, వాటర్‌మార్క్ కూడా ఉంటుంది.
*నోటు ముద్రించిన సంవత్సరం నోట్ వెనుక వైపు వ్రాసి ఉంటుంది

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు