యోగి సర్కార్ సరికొత్త ప్రయోగం... మహిళలు, మాజీ సైనికులకు, వికలాంగులకు అందులో స్పెషల్ డిస్కౌంట్

Published : Aug 29, 2025, 11:51 PM IST
యోగి సర్కార్ సరికొత్త ప్రయోగం... మహిళలు, మాజీ సైనికులకు, వికలాంగులకు అందులో స్పెషల్ డిస్కౌంట్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో మహిళల లాగే పూర్వ సైనికులు, దివ్యాంగులకు కూడా స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇస్తామని సీఎం యోగి ప్రకటించారు.  

ఇల్లు లేదా స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మహిళలకు ఇచ్చినట్టే మాజీ సైనికులు, దివ్యాంగులకు కూడా స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇవ్వనుంది ఉత్తర ప్రదేశ్ సర్కార్. సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ సమీక్షలో ఈ ప్రకటన చేశారు. దీనివల్ల రాష్ట్రంలో వేలాదిమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. 

ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు

ఇకపై అన్ని జిల్లాల్లో 20,000 రూపాయలకు పైగా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని సీఎం యోగి సూచించారు. ముందుగా 5 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ విధానాన్ని మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

 ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి

రిజిస్ట్రేషన్లలో అవకతవకలు, మోసాలను అరికట్టడానికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే అధికారులకు సింగిల్ విండో ఈ-రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించాలని, దీనివల్ల ప్రక్రియ సులభతరం అవుతుందని చెప్పారు.

రిజిస్ట్రేషన్ విభాగంలో ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని సీఎం శాఖను ఆదేశించారు. తగినంత సిబ్బంది ఉంటే పనితీరు, సేవల నాణ్యత మెరుగుపడుతుందని అన్నారు.

చిన్న అద్దె ఒప్పందాలకు రాయితీ

10 సంవత్సరాల లోపు చిన్న, మధ్యతరగతి అద్దె ఒప్పందాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ ఇవ్వడాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇది చిన్న వ్యాపారులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది.

 స్టాంపుల అమ్మకానికి ఇతర మార్గాలను పరిశీలిస్తూ, వెండర్ల కమిషన్‌ను సరళీకృతం చేయాలని సీఎం సూచించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని సీఎం యోగి పేర్కొన్నారు.

డిజిటలైజేషన్, ఈ-స్టాంపింగ్‌లో విజయం

2002 నుంచి 2017 వరకు రిజిస్టర్ చేసిన పత్రాలలో 99 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని ఈ సమావేశంలో యోగి తెలిపారు. ప్రస్తుతం 98 శాతం రిజిస్ట్రేషన్లు ఈ-స్టాంప్ ద్వారా జరుగుతున్నాయన్నారు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజల సమయం, డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !