UP Elections 2022: "అలా జ‌రిగే.. యూపీకి అదృష్టమే.." యోగి వ్యాఖ్యాల‌పై కేర‌ళ సీఎం, ఎంపీ శశిథ‌రూర్ కౌంట‌ర్..

Published : Feb 10, 2022, 03:31 PM IST
UP Elections 2022: "అలా జ‌రిగే.. యూపీకి అదృష్టమే.." యోగి వ్యాఖ్యాల‌పై కేర‌ళ సీఎం, ఎంపీ శశిథ‌రూర్ కౌంట‌ర్..

సారాంశం

UP Elections 2022: ఉత్త‌రప్ర‌దేశ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్..  కేరళగానో, బెంగాల్ గానో లేదా జ‌మ్మూకాశ్మీర్ గానో.. మారే ప్రమాదం ఉందని యోగి ఆదిత్యనాథ్ చేసిన వివాదస్ప‌ద‌ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేర‌ళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ త‌మ‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు.   

UP Elections 2022:  ఉత్త‌రప్ర‌దేశ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్..  కేరళగానో, బెంగాల్ గానో లేదా జ‌మ్మూకాశ్మీర్ గానో.. మారే ప్రమాదం ఉందని యోగి ఆదిత్యనాథ్ చేసిన వివాదస్ప‌ద‌ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ త‌న దైనశైలిలో స్పందించారు. అలా మారితే.. ఉండే ప్ర‌యోజనాలు తెలిపారు. కాశ్మీర్ అందం, బెంగాల్ సంస్కృతి, కేరళ చదువులు అందుకోవడం యూపీ అదృష్టం అనియోగీ వ్యాఖ్య‌ల‌పై  కౌంట‌ర్ ఇచ్చారు. యూపీకి ఆ అదృష్టం ఉండాలి!! కాశ్మీర్ అందం, బెంగాల్ సంస్కృతి, కేరళ విద్య ఈ రాష్ట్రాల‌కు అదృష్టం ' అని  ట్వీట్ చేశారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వివాదస్ప‌ద‌ వ్యాఖ్య‌ల‌పై కేర‌ళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విటర్‌లో మాట్లాడుతూ.. త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అత్యుత్తమ విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయ‌నీ, యూపీ.. కేరళగా మారితే... మతం కార‌ణంగానో.. కులం కారణంగానో చంపుకునే ప‌రిస్థితి ఉండ‌దని అన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ భయపడుతున్నట్లుగా యూపీ కేరళగా మారితే, అత్యుత్తమ విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమం, జీవన ప్రమాణాలు లభిస్తాయని, మతం, కులం పేరుతో హత్యలు జరగని,  సామరస్య సమాజం ఏర్పడుతుందని, యూపీ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన ట్వీట్ చేశారు.

 యూపీలో తొలి విడ‌త పోలింగ్ జ‌రుగుతోంది. పోలింగ్ ప్రారంభానికి ముందు.. సీఎం యోగి త‌న‌ ట్విట్టర్‌లో ఓ వీడియో సందేశం పోస్టు చేశారు. ఆ వీడియోలో యోగి మాట్లాడుతూ.. "జాగ్రత్త! .. నా మనసులో ఉన్న విషయం నీకు చెప్పాలి. ఈ ఐదేండ్ల‌లో  చాలా అద్భుతాలు జరిగాయి. జాగ్రత్త ! ఆద‌మ‌రిస్తే.. ఈ ఐదేండ్ల శ్రమ వృధా అవుతుంది. దీనికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్.. మ‌రో కాశ్మీర్‌, కేర‌ళ లేదా బెంగాల్ గా మార‌వ‌చ్చు’’ అని యోగి ఆదిత్యనాథ్ వీడియోలో పేర్కొన్నారు.

‘ఐదేళ్ల నా శ్రమకు మీ ఓటు దీవెన.. మీ ఓటు కూడా మీ నిర్భయ జీవితానికి గ్యారెంటీ’ అని అన్నారు. "ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. గత ఐదేళ్లలో, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంకితభావం, నిబద్ధతతో ప్రతిదీ చేసింది. మీరు ప్రతిదీ చూశారు.. ప్రతిదీ వివరంగా విన్నారు. ఈ సారి కూడా బీజేపీకి ఓటు వేయండి" అని అన్నారు.  "మీ ఓట్లు అడగడానికి ఇక్కడకు రాలేదు" అని పదేపదే పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్‌లో గురువారం నుంచి 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

యోగి వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థి ఆర్‌ఎల్‌డి చీఫ్ జయంత్ చౌదరి స్పందిస్తూ.. ఓటర్లను ఆన్‌లైన్ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఉద్దేశించిన ప్రకటన అని ఆయన అభిప్రాయపడ్డారు. "మీరు కేరళ అక్షరాస్యత రేటు మరియు తలసరి జిడిపిని పరిశీలిస్తే, కేరళ మనకంటే ముందుందని మీరు కనుగొంటారు" అని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu