విద్యార్థులపైకి దూసుకెళ్లిన బస్సు..ఏడుగురు మృతి

Published : Jun 11, 2018, 09:57 AM ISTUpdated : Jun 11, 2018, 09:59 AM IST
విద్యార్థులపైకి దూసుకెళ్లిన బస్సు..ఏడుగురు మృతి

సారాంశం

యూపీలో దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ వద్ద ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ బస్సు 9 మంది విద్యార్థులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో  ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

మృతిచెందిన విద్యార్థులంతా 20ఏళ్లలోపు వాళ్లేనని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థులంతా ఒక బస్సులోని డీజిల్ ని మరో బస్సులోకి నింపుతున్న సమయంలో.. అటుగా వెళ్తున్న మరో బస్సు వారిపైకి దూసుకెళ్లింది. మృతిచెందిన ఏడుగురిలో ఒకరు టీచర్ కూడా ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu