ముదురుతున్న వార్: ట్విట్టర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు

By narsimha lodeFirst Published Jun 18, 2021, 11:57 AM IST
Highlights

ట్విట్టర్‌కి, కేంద్రం మధ్య వార్ ముదురుతోంది. యూపీ పోలీసులు ట్విట్టర్ ఎండీకి  శుక్రవారం నాడు నోటీసులు పంపారు.

న్యూఢిల్లీ: ట్విట్టర్‌కి, కేంద్రం మధ్య వార్ ముదురుతోంది. యూపీ పోలీసులు ట్విట్టర్ ఎండీకి  శుక్రవారం నాడు నోటీసులు పంపారు.ఈ నెల ప్రారంభంలో ఘజియాబాద్ లో ఓ వ్యక్తిపై దాడి కేసులో మతపరమైన అశాంతిని రేకేత్తించేలా ట్విట్టర్ లో పోస్టులు చేయడంపై ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ట్విట్టర్ ఇండియా ఎండీ  మనీష్ మహేశ్వరీకి  లీగల్ నోటీసు పంపారు. ఈ విషయ,మై ఏడు రోజుల్లోపుగా తన స్టేట్‌మెంట్ ఇవ్వాలని ట్విట్టర్ ను కోరారు పోలీసులు.

ట్విట్టర్ ద్వారా సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు సాధనంగా ఉపయోగించుకొన్నారని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులు ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రం పార్లమెంట్ కాంప్లెక్స్ లోని తమ ముందుహాజరు కావాలని ఐటీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్ టూల్ కిట్ వివాదానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు గతంలోనే  ట్విట్టర్ ఎండీని ప్రశ్నించారు. గురుగ్రామ్ లోని ట్విట్టర్ కార్యాలయాన్ని పోలీసులు గతంలో పరిశీలించారు. ఈ నెల 5న ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన వీడియో వివాదస్పదంగా మారింది. ఈ ట్వీట్లపై ట్విట్టర్ తో పాటు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. 

అల్లర్లను రెచ్చగొట్టడంతో పాటు పలు సమూహాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్టర్ తో పాటు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలు  సహా 8 మందిపై కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ ను ఈ ఏడాది మే 26న అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ రూల్స్ ను అమలు చేయడంలో ఐటీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ట్విట్టర్ మధ్యవర్తి హోదాలను కోల్పోయిందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది.
 

click me!