ఇండియాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. మరణాలు

By narsimha lodeFirst Published Jun 18, 2021, 9:52 AM IST
Highlights

ఇండియాలలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 62,480 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య కూడ గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో కరోనాతో 1587 మంది చనిపోయారు.  దేశంలో కరోనాతో ఇప్పటివరకు 3.83 లక్షల మంది మరణించారు. 

న్యూఢిల్లీ: ఇండియాలలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 62,480 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య కూడ గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో కరోనాతో 1587 మంది చనిపోయారు.  దేశంలో కరోనాతో ఇప్పటివరకు 3.83 లక్షల మంది మరణించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 28న మూడువేలకు పైగా కరోనాతో మరణాలు చోటు చేసుకొన్నాయి.  మే 8వ తేదీన 4 వేలకు పైగా మందికి కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో కరోనాతో 88,997 మంది డిశ్చార్జ్ అయ్యారు.  కరోనా రోగుల రికవరీ రేటు కూడ పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 26.89 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. మహారాష్ట్రలో 26.92 మిలియన్ కేసులు, యూపీలో 24.62 మిలియన్ కేసులు, గుజరాత్ లో 21.3 మిలియన్ కేసులు రికార్డయ్యాయి. రాజస్థాన్ లో20.28 మిలియన్, పశ్చిమబెంగాల్ లో 18.4 మిలియన్ కేసులు నమోదయ్యాయి.దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నుండి అన్‌లాక్ దిశగా వెళ్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసుల వ్యాప్తి తగ్గడంతో అన్‌లాక్ దిశగా రాష్ట్రాలు ప్రయత్నాలను ప్రారంభించాయి.

click me!