రెయిన్ అలర్ట్ : మహారాష్ట్రలో భారీ వర్షాలు.. గోడకూలి ఒకరు దుర్మరణం...

By AN TeluguFirst Published Jun 18, 2021, 10:21 AM IST
Highlights

మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా థానే వెస్ట్ ప్రాంతంలో ఒక భవంతిలో కొంత భాగం శనివారంనాడు కుప్పకూలిపోయింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం, ఈ ఘటన తెల్లవారుజామున 5.20గంటలకు జరిగింది. 

మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా థానే వెస్ట్ ప్రాంతంలో ఒక భవంతిలో కొంత భాగం శనివారంనాడు కుప్పకూలిపోయింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం, ఈ ఘటన తెల్లవారుజామున 5.20గంటలకు జరిగింది. 

అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. ములంద్ వెస్ట్ లో గురువారం గోడ కూలి 35 యేళ్ల వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో నల్లా పొంగిపొర్లుతుండటంతో మూడు గేదెలు కొట్టుకుపోయాయి.

గాలింపు బృందం రెండింటిని కాపాడగా, మరొకి గల్లంతైంది. కాగా, పుణె సిటీలో గురువారం సాయంత్రం ఒక పాత నివాస భవనం కుప్పకూలడంతో ఒక మహిళ సహా ఇద్దరు గాయపడినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో భారీ వర్షాలతో అధికార యంత్రంగం అప్రమత్తమయ్యింది. 

click me!