మీడియాను పిలిచి.. లై‌వ్‌లో ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

By sivanagaprasad kodatiFirst Published Sep 21, 2018, 12:59 PM IST
Highlights

ఫలానా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.. ఇంత మంది చనిపోయారు అని తరచూ టీవీల్లో, పేపర్లలో చూస్తూ ఉంటాం. చాలామందికి ఎన్‌కౌంటర్‌ను లైవ్‌లో చూడాలని ఉంటుంది. 

ఫలానా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.. ఇంత మంది చనిపోయారు అని తరచూ టీవీల్లో, పేపర్లలో చూస్తూ ఉంటాం. చాలామందికి ఎన్‌కౌంటర్‌ను లైవ్‌లో చూడాలని ఉంటుంది. అయితే ఇదే సమయంలో అవి నకిలీ ఎన్‌కౌంటర్లని.. పోలీసులు కావాలనే చేశారని మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి సమాధానంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు విభిన్నంగా ఆలోచించారు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ముస్తకిమ్, నౌషద్‌లు బైక్‌పై వెళుతున్నట్లుగా హర్దుగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్, ఇతర సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు పోలీసులపై కాల్పులు జరుపుతూ సమీపంలోని గ్రామంలోకి పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు పాడుబడిన నీటిపారుదల శాఖ భవనంలో ఉన్నట్లుగా గుర్తించి.. ఆ భవనాన్ని చుట్టుముట్టారు.. ఇలోగా అదనపు పోలీసు బలగాలు వారికి జతకలిశాయి.

వెంటనే ‘‘ మరి కాసేపట్లో లైవ్ ఎన్‌కౌంటర్ ఉంది.. కవరేజ్‌కు రావాల్సిందిగా మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.’’ అంతే క్షణాల్లో ఆ ప్రదేశానికి ఓబీ వ్యాన్లు, జాతీయ, స్థానిక మీడియా  ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. నరహంతకులిద్దరూ పాడుబడిన కార్యాలయంలో దాక్కొని కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

కాసేపటి తర్వాత కాల్పులు ఆగిపోయాయి.. లోపలికి వెళ్లి చూస్తే నిందితులిద్దరూ చనిపోయి ఉన్నారు. దంపతులు, ఇద్దరు రైతులు, మరో ఇద్దరు పూజారులను హత్య చేసిన కేసులో వీరిద్దరూ ప్రధాన నిందితులు.

అంతేకాకుండా వీరిపై 10 దొంగతనం కేసులు కూడా ఉండటంతో పోలీసులు ఒక్కొక్కరిపై రూ.25 వేల రివార్డు కూడా ప్రకటించారు. అయితే ఎన్‌కౌంటర్ల గురించి పారదర్శకంగా వ్యవహరించడానికే మీడియాను ఆహ్వానించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

click me!
Last Updated Sep 21, 2018, 12:59 PM IST
click me!