యువతిపై ఎండీ లైంగిక వేధింపులు.. ఛాంబర్‌లో కెమెరా పెట్టి పట్టించిన యువతి

sivanagaprasad kodati |  
Published : Sep 21, 2018, 12:12 PM IST
యువతిపై ఎండీ లైంగిక వేధింపులు.. ఛాంబర్‌లో కెమెరా పెట్టి పట్టించిన యువతి

సారాంశం

తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కళాశాల ఎండీ బాగోతాన్ని చాకచక్యంగా బహిర్గతం చేసింది ఒక యువతి. కోయంబత్తూరు ఎంఎన్ఎస్‌ కళాశాలలో ఓ యువతి పనిచేస్తోంది. 

తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కళాశాల ఎండీ బాగోతాన్ని చాకచక్యంగా బహిర్గతం చేసింది ఒక యువతి. కోయంబత్తూరు ఎంఎన్ఎస్‌ కళాశాలలో ఓ యువతి పనిచేస్తోంది. ఈ క్రమంలో కళాశాల ఎండీ ఏదో ఒక పని చెప్పి తరచూ ఆమెను తన గదిలోకి పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.

రెండేళ్ల నుంచి మౌనంగా అతని వేధింపులు భరిస్తున్న ఆమె ఎండీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎండీ ఛాంబర్‌లో సీక్రెట్ కెమెరాలను పెట్టింది. ఒక రోజు యువతిని ఎండీ తన గదిలోకి పిలిచి అసభ్యంగా తాకుతూ.. అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు కెమెరాలో రీకార్డయ్యాయి.

వీటిని తీసుకుని యువతితో సహా తోటి ఉద్యోగులు ఎండీ కుమారుడు వద్ద తెలపగా.. అతను ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం విదేశాల్లో పెద్ద తప్పేమి కాదని సమర్థించడమే కాకుండా.. మీ పనులు మీరు చూసుకోండి లేదంటే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించాడు.

అంతేకాకుండా కెమెరాలు పెట్టి తన తండ్రి పరువుకు నష్టం కలిగించినందుకు సదరు యువతిని ఉద్యోగంలో నుంచి తొలిగించాడు. దీంతో ఆ యువతి ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!