కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్? సోషల్ మీడియాలో ఆందోళనలు.. బోర్డు ఏమన్నదంటే?

By Mahesh K  |  First Published Feb 19, 2024, 3:26 PM IST

యూపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్ష పేర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీపీపీఆర్‌బీ స్పందించింది. పేపర్ లీక్ ఆరోపణలను తోసిపుచ్చింది.
 


UP Police Constable Exam: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థుల పాలిట పేపర్ లీక్ అనే పదం శాపంగా మారింది. ఒక్క పేపర్ లీక్‌తో పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. పరీక్షలు వాయిదా పడటం.. వాటి కోసం ఎదురుచూడటం.. మళ్లీ సన్నద్ధం కావడం అనేది మానసికంగానూ చాలా ఆందోళనకరమైన విషయం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అనే టాపిక్ ట్రెండ్ అవుతున్నది.

ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ పరీక్షలు 2024 జరుగుతున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన సెకండ్ షిఫ్ట్‌లో పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు పేపర్ లీక్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎక్స్, వాట్సాప్‌లో ఇదే పేపర్ లీక్ గురించిన ఆందోళనలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై, యూపీ పోలీసు రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Latest Videos

ఈ నేపథ్యంలోనే బోర్డు ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చింది. కొందరు దుండగులు టెలిగ్రామ్ ఎడిట్ ఫెసిలిటీ ద్వారా తప్పుడు విషయాలను, వదంతులను సృష్టిస్తున్నారని తమ ప్రాథమిక నివేదికలో తేలిందని వివరించింది. బోర్డు, అలాగే యూపీ పోలీసులు ఈ ఘటనలను పరిశీలిస్తున్నదని పేర్కొంది. పరీక్షలు సేఫ్‌గా, స్మూత్‌గా కొనసాగుతున్నాయని తెలిపింది.

Also Read: Janasena: సీఎం జగన్‌ పంచ్‌లకు నాగబాబు కౌంటర్.. ‘గ్లాస్ సింక్‌లో ఉన్నా.. ’

ఇదిలా ఉండగా.. పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షలో చీటింగ్‌ చేస్తుండగా, చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసుల 244 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పీటీఐ ఓ కథనంలో పేర్కొంది.

click me!