వికాస్ దూబే మరో అనుచరుడు అరెస్ట్: 11 మంది కోసం గాలింపు చర్యలు

Siva Kodati |  
Published : Jul 14, 2020, 04:49 PM ISTUpdated : Jul 14, 2020, 04:58 PM IST
వికాస్ దూబే మరో అనుచరుడు అరెస్ట్: 11 మంది కోసం గాలింపు చర్యలు

సారాంశం

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడు శశికాంత్‌ను యూపీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాన్పూర్‌లో పోలీసులపై దాడికి తెగబడ్డ వికాస్‌కు శశికాంత్ సహకారం చేశాడు.

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడు శశికాంత్‌ను యూపీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాన్పూర్‌లో పోలీసులపై దాడికి తెగబడ్డ వికాస్‌కు శశికాంత్ సహకారం చేశాడు. ఈ కేసులో ఇతనితో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దీనిపై పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులు భాగస్వామ్యం అయినట్లు వెల్లడించారు. వీరిలో నలుగురిని అరెస్ట్ చేయగా దూబేతో సహా ఆరుగురు నిందితులను వివిధ ఘటనల్లో పోలీసుల విచారణలో మరణించినట్లు పేర్కొన్నారు.

మిగతా 11 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. అలాగే కాన్పూర్ ఆకస్మిక దాడిలో యూపీ పోలీసుల నుంచి నేరస్తులు ఎత్తుకెళ్లిన రెండు రైఫిల్స్‌ను కూడా శశికాంత్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై దాడి ఘటన అనంతరం పోలీసుల నుంచి నేరస్తుల ముఠా దోచుకున్న అన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లైంది.

కాగా ఈ నెల 3న వికాస్ దూబే అనుచరులు కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైన వికాస్ దూబే గత శుక్రవారం పోలీసుల చేతిలో హతమయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం