స్కూల్‌ను దత్తత తీసుకున్న పోలీసు అధికారి.. రోజూ గంట టీచ్ చేస్తున్న పోలీసు బృందం

Published : May 19, 2022, 03:25 PM ISTUpdated : May 19, 2022, 03:27 PM IST
స్కూల్‌ను దత్తత తీసుకున్న పోలీసు అధికారి.. రోజూ గంట టీచ్ చేస్తున్న పోలీసు బృందం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని బర్గద్వా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ప్రైమరీ స్కూల్‌ను దత్తత తీసుకున్నారు. రోజువారీగా శాంతి భద్రతలు కాపాడటంతోపాటు తమ వ్యక్తిగత జీవితంలో నుంచి రోజు ఒక గంట స్థానిక ప్రాథమిక పాఠశాలలో బోధించడానికి నిర్ణయం తీసుకున్నారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదర్శవంత నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడే తమ విధులతోపాటు పిల్లల విద్యలో నాణ్యత పెంచడానికి, వారి భవిష్యత్‌కు మెరుగులు దిద్దాలనే నిర్ణయంతో ఓ ప్రైమరీ స్కూల్‌ను దత్తత తీసుకున్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలోని బర్గద్వా పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సునీల్ రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని సునీల్ రాయ్ టీమ్ దత్తత తీసుకుంది.

ఈ పోలీసు బృందం ప్రతి రోజు ఉదయం ఈ స్థానిక పాఠశాలలో బోధిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం తమ వ్యక్తిగత సమయంలో నుంచి ఒక గంటల స్కూల్‌లో పాఠాలు చెప్పడానికి కేటాయిస్తున్నారు. పోలీసులు బోధిస్తున్న తరగుతలను ఇప్పుడు తానేదార్ సాహిబ్ క్లాసులు అని పిలుస్తున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో విద్యను మెరుపరచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు విడుదల చేయగానే.. బర్గద్వా పోలీసులు ఇంకో అడుగు ముందు వేయాలని భావించారు. ఏకంగా వారు ఓ ప్రాథమిక పాఠశాలనే దత్తత తీసుకున్నారు.

ఈ నిర్ణయం గురించి ఎస్‌హెచ్‌వో సునీల్ రాయ్ మాట్లాడారు. తాము ఆ పిల్లల బాగోగులు చూసుకుంటామని వివరించారు. వారి చదువులతోపాటు వారికి అవసరం అయిన ఇతర స్టేషనరీని అందిస్తామని చెప్పారు. వారు చదివి ఎదగడానికి సరిపోయే మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. పిల్లలు మంచి విద్యను అందుకోవడానికి తాము సహాయపడటం ఆనందంగా ఉన్నదని వివరించారు. ఇదే సందర్భంగా ఆయన ఎస్‌హెచ్‌వో కావడానికి ముందు ఉపాధ్యాయ వృత్తి చేపట్టినట్టు సునీల్ రాయ్ వెల్లడించారు.

ఈ ఏడాది తెలంగాణ  సీఎం కేసీఆర్(KCR) జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా.. అడవిని దత్తత తీసుకుంటున్నట్టు టాలీవుడ్ హీరో నాగార్జున తెలిపారు. మేడ్చల్ జిల్లా లోని చెంగిచెర్ల లో ఉన్న అడవిని నాగార్జున అడాప్ట్ చేసుకున్నారు. త‌న భార్య అక్కినేని అమ‌ల‌, మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో క‌లిసి వెళ్లి  చెంగిచెర్ల‌లో నాగార్జున‌ (Nagarjuna) అడ‌విని సందర్శించాడు.. దత్త‌త కార్యక్రమాన్ని పూర్తి చేశాడు.


అంతే కాదు తాను దత్తత తీసుకున్న అడవికి నామకరణం కూడా చేశాడు నాగార్జున (Nagarjuna). అడవికి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్బ‌న్ ఫారెస్ట్ అని పేరు కూడా పెట్టాడు. అంతే కాదు అక్కడ పారెస్ట్ డెవలప్ మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లకు శంకుస్థాప‌న చేశారు. కేసీఆర్(KCR) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాగార్జున అడ‌విని ద‌త్త‌త తీసుకున్నారు. అక్కడ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఆయన తనయులు నాగ చైత‌న్య(Naga Chaitanya), అఖిల్(Akhil) కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?